YS Viveka Murder Case: వివేకా హత్య విచారణ అనూహ్య మలుపు.. సీబీఐ సీన్ లోకి అల్లుడు రాజశేఖర్ రెడ్డి

మాజీ మంత్రి వివేకా మర్డర్ కేసు (YS Viveka Murder Case) విచారణ అనూహ్య మలుపు తిరిగింది. ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి కుటుంబం వైపు మళ్లింది. ఆమె భర్త నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి (Narreddy Rajasekhar Reddy)ని శనివారం విచారించిన సీబీఐ

  • Written By:
  • Updated On - April 23, 2023 / 03:23 PM IST

మాజీ మంత్రి వివేకా మర్డర్ కేసు (YS Viveka Murder Case) విచారణ అనూహ్య మలుపు తిరిగింది. ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి కుటుంబం వైపు మళ్లింది. ఆమె భర్త నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి (Narreddy Rajasekhar Reddy)ని శనివారం విచారించిన సీబీఐ (CBI) సోమవారం ఆయన సోదరుడు శివ ప్రకాష్ రెడ్డి ని పిలుస్తారని తెలుస్తుంది. హత్య జరిగిన రోజు వివేకా రాసిన లేఖ చుట్టూ సీబీఐ విచారణ జరుగుతుంది. ఆ లేఖను డాక్టర్ సునీత దంపతులు దాచారని అవినాష్ రెడ్డి తొలి నుంచి చెబుతున్నారు. దానిలో ఏముందో చూస్తే హత్య ముడి వీడుతుందని సీబీఐ వద్ద వినిపించారట.

అందుకే సిఆర్పిసీ 160 నోటీస్ ఇచ్చి సునీతా రెడ్డి భర్తను సీబీఐ విచారించింది. ఆయన ఇచ్చిన సమాధానానికి సమాంతరంగా వివరాలు తెలుసుకోవడానికి సునీత రెడ్డి, ఆమె మర్ది శివప్రకాశ్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా వివేకా రెండో భార్యగా చెబుతున్న షమీమ్ సోమవారం సునీతా కుటుంబ వేదింపులపై తెలంగాణ హై కోర్టులో పిటిషన్ వేస్తారని సమాచారం . అదే జరిగితే సీబీఐ విచారణ అంతా యు టర్న్ తీసుకొని అవినాష్ సేఫ్ సైడ్ కు వచ్చినట్టే. ఇప్పటికే మూడు పేజీల లేఖను సునీతా రెడ్డి కుటుంబం వేధింపులపై షమీమ్ సీబీఐకి అందచేసింది. ఆ లేఖలో వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని షమీమ్ వెల్లడించారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డి కన్నేశారని షమీర్ ఆరోపించారు. తమ కొడుకు షహన్ షా పేరు మీద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా.. శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని ఆమె వివరించారు.

వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని ఆమె ఆరోపించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని షమీమ్ తెలిపారు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పాడని.. హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్న.. శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షమీమ్ వెల్లడించారు. సీబీఐకి షేక్ షమీమ్ మూడు పేజీల స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. తనకు వివేకా గారికి పుట్టిన సంతానమే షేక్ షహన్ షా అని.. తాను డీఎన్‌ఏ టెస్ట్ కు సిద్ధమేనని షమీమ్ తెలిపారు. మాకు సంతానం కలగలేదని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న దస్తగిరి, నిరూపిస్తే నేను మీరు చెప్పినట్లు చేస్తానని పేర్కొన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే వెంటనే ఈ హత్య చేసిన నీవు ఉరిశిక్షకు సిద్దమా అని దస్తగిరికి సవాల్ చేశారు. తన లాయర్ ద్వారా మీడియాకు ఈ స్టేట్‌మెంట్‌ను చేరేలా చేశారు. దీంతో ఈ స్టేట్ మెంట్ అంశం సంచలనంగా మారింది.

Also Read: Balineni Srinivasa Reddy: రాజకీయ విరమణకు మాజీ మంత్రి బాలినేని సై
.
ఆ లేఖ అందిన తరువాత మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ.. హైదరాబాద్‌ లోని ఆఫీస్ కు విచారణకు రావాలని కోరింది. దీంతో శనివారం ఆయన విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యాస్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. ఆ లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పారని ప్రశ్నించినట్లు సమాచారం. శనివారం సాయంత్రం 4 గంటలకు సీబీఐ ఆఫీస్ కు వచ్చిన రాజశేఖర్‌రెడ్డి.. విచారణ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడంలేదని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తున్న తరుణంలో.. రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేకా హత్య కేసులో ఇటీవల అరెస్టైన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తుంది. ఈ కేసు విచారణ సోమవారం అనూహ్య మలుపు తిరిగే ఛాన్స్ ఉంది.