Site icon HashtagU Telugu

Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్

Viveka Murder Case

Viveka Murder Case

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శివశంకరరెడ్డి ప్రస్తుతం అండర్‌ ట్రయల్‌గా చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. 2 లక్షల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

హైదరాబాద్ వదిలి వెళ్లవద్దని, పాస్‌పోర్టును అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి సోమవారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌కు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 2021 నవంబర్‌లో ఈ కేసులో అరెస్టయ్యాడు. పలుమార్లు పలు కోర్టుల్లో బెయిల్ దరఖాస్తులు చేసుకున్న ఆయన ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Also Read: Dharani Portal: ధ‌ర‌ణి ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు