వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. ఆ పార్టీలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల షర్మిల పెట్టిన వైస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోన్న ఆమె వైసీపీకి రాజీనామా చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలోనూ బ్రదర్ అనిల్ పార్టీ పెట్టాలని ప్రయత్నం చేస్తోన్న టైంలో విజయమ్మ రాజీనామా కు సిద్ధపడ్డారని తాడేపల్లి టాక్. ఈ రాజీనామా వైసీపీలో సంచలనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జగన్ జైలులో ఉన్న సమయంలోనూ, 2014, 2019 ఎన్నికల్లోనూ విజయమ్మ ఆ పార్టీ విజయం కోసం ప్రచారం చేసారు. జగన్ అధికారంలోకి వచ్చే వరకూ తోడుగా నిలిచారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక, ఇప్పుడు విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారా? లేక, అటువంటి నిర్ణయం తీసుకోకుండా జగన్ వారిస్తారా అనేది ఆ పార్టీలో అంతర్గతంగా నడుస్తోన్న చర్చ.
జూలై 8న వైసీపీ ప్లీనరీ జరుగుతుంది. అప్పటి వరకు కొనసాగాలని జగన్ కోరినట్టు సమాచారం .వైఎస్సార్టీపి కార్యక్రమాల్లో విజయమ్మ కనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ ఇలా పాల్గొనటం పైన ఇటీవల షర్మిల సమాధానం ఇస్తూ..తన తల్లిగా పాల్గొంటున్నారని సమాధానమిచ్చారు. షర్మిల వైఎస్సార్టీపీ ఏర్పాటు చేయటం… ఆ కార్యక్రమాల్లో అప్పడప్పుడూ పాల్గొనుతున్న సమయంలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగటం సరి కాదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించి విజయమ్మ రాజీనామాకు సిద్దమయ్యారని తెలుస్తోంది.సోదరి షర్మిలతో జగన్ కు భిన్నాభిప్రాయాలే కానీ, బేదాభిప్రాయాలు లేవని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. విజయమ్మ మాత్రం ఎక్కువగా కుమార్తె షర్మిలతో ఉంటున్నారు. షర్మిల పాదయాత్ర లోనూ అక్కడక్కడా సభల్లో పాల్గొంటున్నారు.సీఎం జగన్ తో కలిసి విజయమ్మ పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ పురస్కారాల ప్రధాన సభకు హాజరయ్యారు. అయితే, పార్టీ ఏర్పాటు సమయంలోనే విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే హోదాలో కొనసాగుతున్నారు. షర్మిల, బ్రదర్ అనిల్ పెట్టె పార్టీ కోసం విజయమ్మ రాజీనామాకు సిద్దం అయిందని తెలుస్తోంది. జగన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అంటూ వైసీపీ క్యాడర్ చర్చించుకుంటుంది.