Site icon HashtagU Telugu

YS Sunitha : తనను నరికేస్తారో.. లేక షర్మిలను నరికేస్తారో తెలియదు – వైఎస్ సునీత

Sunitha Bharathi

Sunitha Bharathi

ఏపీలో రాజకీయాలు (AP Politics) ఒకెత్తు..కడప (Kada ) రాజకీయాలు (Politics) ఒకెత్తు. కడప లో మొత్తం వైఎస్ వివేకా హత్య (Murder of YS Viveka) చుట్టూనే ఎన్నికల ప్రచారం నడుస్తుంది. కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా వైస్ షర్మిల (YS SHarmila) బరిలోకి దిగగా..వైసీపీ నుండి అవినాష్ రెడ్డి (Avinash Reddy) పోటీ చేస్తున్నారు. దీంతో కడప ఎన్నికల్లో ఎవరు విజయం సాదిస్తారనేది ఆసక్తి గా మారింది. కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి కూడా షర్మిల..జగన్ , అవినాష్ రెడ్డి లనే టార్గెట్ గా చేస్తూ వస్తుంది. ఈమె తో పాటు వివేకా కూతురు సునీత సైతం అవినాష్ రెడ్డి ఫై కీలక ఆరోపణలు చేస్తూ వస్తుంది. తన తండ్రిని చెప్పిన వ్యక్తికి ఓటు వెయ్యొద్దని, షర్మిల ను గెలిపించాలని కోరుతూ వస్తుంది.

ఈరోజు ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలోను సునీత రెడ్డి (YS Sunitha Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో సింగల్ ప్లేయర్​గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని జగన్ భార్య భారతిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. భారతి ‘నన్ను నరికేస్తారో, లేక షర్మిలను నరికేస్తారో తెలియదు గానీ సింగల్ ప్లేయర్​గా ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ’ అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్​ను ఎదిరించి మాట్లాడే ధైర్యం , సత్తా వివేకాకు ఉంది కాబట్టే ఆయన్ను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, అన్నింటికీ తెగించే పోరాడుతున్నానని సునీత స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతున్నట్లు జగన్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ఏమైనా పోలీసా లేక సీబీఐనా లేక కోర్టా అంటూ నిలదీశారు. నిందితుడు అవినాష్ రెడ్డి చెబుతున్న మాటలు నమ్ముతున్న జగన్ నా ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డికి న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని సూచించారు. వివేకా కేసును తప్పుదారి పట్టించేందుకు అబద్దాలు చెబుతున్నారన్న సునీత నిందితులను జగన్ ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

దేశమంతా ఎన్నికలు సాధారణంగా జరుగుతుంటే..కడప లో న్యాయానికి, నిందితులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు న్యాయం, అభివృద్ధి వైపు ఉంటారా లేదా అనేది ప్రపంచం మొత్తం చూస్తోందని తెలిపారు.

Read Also : Sanjeev Goenka Angry: సంజీవ్ గోయెంకా ఓవరాక్షన్… అప్పుడు ధోనీ.. ఇప్పుడు కేఎల్ రాహుల్.