Site icon HashtagU Telugu

Viveka Murder : ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా జగన్ ..? – వివేకా కుమార్తె

Viveka Murder Case

Viveka Murder Case

సిద్ధం సభలో వివేకా హత్య ఫై జగన్ మాట్లాడిన తీరు ఫై వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా జగన్ ..? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ నిన్న శ్రీకారం చుట్టున సంగతి తెలిసిందే. ప్రొద్దుటూరు (Proddatur ) లో జరిగిన మీమంతా సిద్ధం సభలో జగన్ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు… ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి , తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే..కొన్ని ఏళ్లుగా రాష్ట్రంలో చర్చగా మారిన వివేకా హత్య (Viveka Murder Case) ఫై జగన్ (jagan) సభ వేదికపై స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘మా వివేక చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు..రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ తనపై బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను తీసుకొచ్చారని.. వారిని ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసన్నారు. చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడికి ఈరోజు మద్దతు ఇస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా షర్మిల , సునీతలను విమర్శించారు. ప్రత్యర్థులంతా ఒక్కటై తనపై యుద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై సునీత ఘాటుగా స్పందించింది. “ఇప్పుడు ఎన్నికలు రావడంతో చిన్నాన్న గుర్తుకు వచ్చారా? చిన్నాన్న చనిపోయి ఐదేళ్లవుతోంది… ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడడం సరికాదు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే నేను బయటికి రావాల్సి వచ్చింది. నేను చెప్పేదంతా నిజం… మీరు కూడా ఇలాగే చెప్పగలరా?

వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెబుతున్నారు. కానీ వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారు. ఎవరు చంపించారో హత్య చేసిన వ్యక్తి స్పష్టంగా చెబుతున్నారు. నిందితుల వెనుక అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరారు… ఆ తర్వాత మీరే వద్దన్నారు. మీ పేరు బయటికి వస్తుందనే సీబీఐ విచారణ కోరట్లేదా? నిందితుడిని పక్కనబెట్టుకుని, అతడికి ఓటు వేయాలని కోరుతున్నారు. అతడు నిందితుడు అని సీబీఐ చెబుతున్నా, మీరు అతడికి ఓటు వేయాలని కోరుతున్నారు. మీ చిన్నాన్నను చంపిన వ్యక్తికి ఓటు వేయాలని అడగడం మీకు తప్పుగా అనిపించడంలేదా?

ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో సానుభూతి కోసమే చిన్నాన్నను తెరపైకి తీసుకువస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం… మీరు పోరాడేది పదవుల కోసం. ఈ సందర్భంగా, హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరుతున్నా. పదవులు ఆశించి రాజకీయాలు చేస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు చెల్లెలు గుర్తుకు రాలేదా? నాకు న్యాయం కావాలి అని నేను ఎలుగెత్తుతుంటే, మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు. అన్నీ మరిచిపోయి ఓటు అడిగేందుకు మీకు మనసెలా అంగీకరిస్తుంది? హత్య చేసిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. హత్య చేసిన, చేయించిన వారితో తిరుగుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి” అంటూ సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also : CM Revanth Reddy : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు..