Site icon HashtagU Telugu

YS Sharmila : వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను – వైస్ షర్మిల

Sharmila Ysr Ghat

Sharmila Ysr Ghat

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం షర్మిల..ఏపీలో అడుగుపెట్టింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో కడప కు చేరుకున్న షర్మిల..నేరుగా ఇడుపులపాయ కు చేరుకొని వైస్సార్ ఘాట్ కు నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు స్పష్టం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

రేపు ఉదయం విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు స్వీకరించబోతున్నట్లు షర్మిల తెలిపారు. తండ్రి ఆశీర్వాదం కోసం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని, వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానమని, సిద్ధాంతాల కోసం వైఎస్సార్ ఎంత దూరం అయినా వెళ్ళే నేత అని తెలిపారు. నేడు దేశంలో సెక్యులరిజం అనే పదానికి, ఫ్యూలరిజం అనే పదాలకు అర్థం లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయిందని, భారత దేశానికి మళ్ళీ మంచి జరగాలి అంటే వైఎస్సార్ ఆశయాలు అన్ని సిద్ధించాలని అన్నారు. వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం కోసం నేను పార్టీలో ఆఖరి వరకు నిలబడతానని స్పష్టం చేశారు.

ఇక వైస్సార్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన వారిలో కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి అహ్మదుల్ల ఘాట్ వద్ద APCC చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read Also : Chandrababu : అరకు ‘రా కదలిరా’ సభలో కీలక హామీ ప్రకటించిన చంద్రబాబు