Site icon HashtagU Telugu

AP : షర్మిల.. పవన్ కు ఇచ్చిన గౌరవం కూడా జగన్ కు ఇవ్వలేదా..?

Sharmila Pawan

Sharmila Pawan

వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న జగన్ (Jagan) ఫై ఎంత కోపం గా ఉందో..తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం (YS Sharmila Son Engagement) వేడుకలో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజా రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వేడుకలు తన అన్న వైపు చూడడం కానీ , కనీసం పెద్దగా మాట్లాడినట్లు కానీ ఎక్కడ కనిపించలేదు. స్వయంగా జగనే కల్పించుకుని షర్మిలతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె పెద్దగా స్పందించ లేదని బయటకు వచ్చిన వీడియోస్ చూస్తే అర్ధం అవుతుంది. షర్మిల తీరు చూసి ఆమె భర్త అనిల్ కూడా సందిగ్ధంలో పడిపోవడం స్పష్టంగా కనిపించింది. దానితో తన తల్లి విజయమ్మతో కాసేపు ముచ్చటించి జగన్ మేనల్లుడినీ ఆయనకు కాబోయే భార్యను ఆశీర్వదించి సతీసమేతంగా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ వేడుకకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. పవన్ చేరుకోగానే బ్రదర్ అనిల్ తోపాటు షర్మిల స్వయంగా దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఎంతో ఆప్యాయంగా పవన్ తో మాట్లాడడం..కలిసి ఫొటోస్ తీసుకోవడం..కాసేపు సరదాగా గడపడం చూసి చాలామంది పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన గౌరవం అన్న జగన్ కు ఇవ్వలేదని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా జగన్ తన బద్ద శత్రువులా భావించే పవన్‌కు ఆయన సోదరి తమ కుటుంబ వ్యవహారంలో ఇంతటి ఆదరం చూపడం జగన్ కు ఇబ్బంది కలిగించే అంశమే. ఏదేమైనా రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు అనుకుంటూ వస్తున్న YSR అభిమానులకి అన్నా చెల్లెళ్ళ మధ్య వ్యక్తిగత స్థాయిలో పెరిగిపోయిన విభేదాలు షర్మిల కుమారుడి నిశ్చితార్థం సాక్షిగా బయటపడడం తట్టుకోలేకపోతున్నారు.

Read Also : Pannun Warning : సీఎం యోగిని చంపేస్తాం.. 22న అయోధ్యలో ఎటాక్ తప్పదు : పన్నూ