Site icon HashtagU Telugu

AP : మరో బాంబ్ పేల్చిన షర్మిల..ఈసారి వైసీపీ నేతలు ఏమంటారో..?

Sharmila Sakshi

Sharmila Sakshi

ఏపీసీసీ బాధ్యత చేపట్టిన వైస్ షర్మిల (YS Sharmila)..రోజుకో బాంబ్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తన అన్న జగన్ (Jagan) చేసిన మోసాలను బయటపెడుతూ..సిపంతి పెంచుకునే పనిలో పడింది. జగన్ ను గెలిపేంచేందుకు షర్మిల ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి షర్మిల ను జగన్ దూరం పెట్టడం..అది కూడా ఆస్తుల కోసం దూరం పెట్టాడనే వార్తలు బయట వినిపిస్తుండడంతో వైస్సార్ అభిమానులంతా జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు స్వయంగా షర్మిలనే జగన్ ఫై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుండడం తో షర్మిల ఫై మరింత సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

ఓ పక్క వైసీపీ ప్రభుత్వం (YCP Govt) వల్ల రాష్ట్రం ఎంత వెనుకపడిందో చెపుతూనే..వ్యక్తిగత విమర్శలు చేస్తూ షర్మిల వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటికే ఎన్నో విషయాలు షేర్ చేసిన షర్మిల..ఈరోజు మరో బాంబ్ పేల్చింది. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ మీడియా అయిన సాక్షిలో తనకూ భాగం ఉందంటూ ప్రకటించారు. తనపై రోజుకో జోకర్‌ను తీసుకొచ్చి విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎన్ని నిందలు వేసినా తాను మాత్రం వైఎస్‌ షర్మిలా రెడ్డినే అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో తనతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుందని… తనపై వ్యతిరేకంగా మాట్లాడాలని చెపుతున్నారని షర్మిల ఆరోపించారు. అదే సాక్షి సంస్థలో తనకూ భాగం ఉందని..ఆ సంస్థలో వైఎస్సారే తనకు సగం భాగం ఇచ్చారని షర్మిల స్పష్టం చేసింది. సగం భాగం ఉన్నా నాపై నా సంస్థ బురద చల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. కడప నా పుట్టిన ఇల్లని చెప్పుకొచ్చిన షర్మిల. జగన్ ఎలా పుట్టారో తను కూడా అలానే పుట్టానన్నారు. జమ్మల మడుగు ఆసుపత్రిలో పుట్టినట్టు చెప్పుకొచ్చారు. జగన్‌కు నేను వ్యతిరేకి కాదన్నారు షర్మిల. ఇద్దరిదీ ఒకటే రక్తం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని ఆరోపించారు. ఇప్పుడున్న జగన్‌ను ఎప్పుడు చూడలేదన్నారు. ఆయనకు క్యాడర్‌కి, పార్టీకి తాను చేసిన సేవలు గుర్తు లేవన్నారు. తనపైనే స్టోరీలు అల్లుతున్నారని ఆవేదన చెందారు.

Read Also : Group-1 : గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం వేచి ఉండాల్సిందేనా..?