Ys Sharmila : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ రోజా కు షర్మిల వార్నింగ్..

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 02:26 PM IST

వైసీపీ ఫైర్ బ్రాండ్ , మంత్రి రోజా (Minister Roja) కు ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Apcc Chief Ys Sharmila) వార్నింగ్ ఇచ్చారు. నగరి బహిరంగ సభ (Nagari Public Meeting)లో మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకోవాలని రోజా ను హెచ్చరించారు షర్మిల. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుండే షర్మిల..తన దూకుడు ను కనపరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఫై , జగన్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ బిజీ గా ఉన్న షర్మిల..నగరి లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలే చేసారు. “నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా. నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ.. ఈవిడతో పాటు రోజా అన్నలు, భర్త కలిపి నగరి నియోజకవర్గానికి నలుగురు మంత్రులు. ఇసుక, మట్టి, గ్రావెల్, స్థలాలు ఇలా అన్నీ దోపిడీ. ఎక్కడ చూసినా అవినీతే” అంటూ షర్మిల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రోజాను ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనేవారన్న షర్మిల.. అప్పట్లో వైఎస్ఆర్‌ను పంచె విప్పి కొడతానంటూ ఆమె చేసిన మాటలు గుర్తున్నాయని అన్నారు. ఇక తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

సొంత చెల్లెలు అని కూడా చూడకుండా సోషల్ మీడియా వేదికగా అవమానిస్తారా? అంటూ జగన్ పై నిప్పులు చెరిగింది షర్మిల. ఒక్క నిమిషం పాటు.. నేను వైఎస్ఆర్ బిడ్డను కాదనుకోండి.. మీకు దమ్ముంటే ఏం చేస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ చెప్పారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తైందా? తట్టెడు మట్టె మళ్లీ ఎత్తి ఇటు పోశారా? జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డికి ప్రాణం అయితే.. అసలు నవరత్నాలలో అదొక రత్నం కదా? జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అన్నారు. నవరత్నాల్లో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడికి పోయింది జలయజ్ఞం అంటూ సూటి ప్రశ్నలు సంధించారు.

నా పుట్టింటికి అన్యాయం జరుగుతోంది కాబట్టి, ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నామీ కూడా ఉంది కాబట్టి.. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చా. తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు, పోరాటానికి అక్కడ ఒక నియంతను దించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంతను దించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్లీ ఇక్కడ అడుగుపెట్టింది అని షర్మిల స్పష్టం చేసింది.

Read Also : Hyderabad : మానవత్వం మంట కలిసిందనే దానికి ఇదే ఉదాహరణ..