Site icon HashtagU Telugu

YS Sharmila : సీఎం జగన్‌పై వైఎస్‌ షర్మిల సంచలనం..!

Sharmila

Sharmila

ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) రాష్ట్ర అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌కు నాకు పరిచయం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. హత్యారాజకీయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని, నా అనుకున్నవాళ్లను కాకుండా చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. అంతేకాకుండా.. తను కడప ఎంపీగా పోటీ చేయాలనేది వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) చివరి కోరిక అని, ఆయన కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నానని వైఎస్‌ షర్మిల అన్నారు. సునీత కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతోందని, హంతకుడైన అవినాష్‌ రెడ్డి (YS Avinash Reddy)ని చట్ట సభల్లో అడుగుపెట్టకుండా చేయడమే నా లక్ష్యమన్నారు ష్మరిల.

We’re now on WhatsApp. Click to Join.

కడపలో అతను గెలవకూడదు అంటే నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నానని షర్మిల కోరారు. కడప పార్లమెంట్‌కి పోటీ చేయడం.. అంత సులువైంది కాదని తెలుసు అని, నేను పోటీలో ఉంటే మా కుంటుంబ నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు షర్మిల నా చెల్లెలు కాదు.. నా బిడ్డ అని జగన్‌ అన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా విస్మరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్‌ వారిని కాపాడుతున్నారని, చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి జగన్‌ వైసీపీ టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేక పోయానని ఆమె వెల్లడించారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయ కోసం వాడుకుందని, హత్య చేయించిన వారికి టికెట్‌ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా అతనికే టికెట్‌ ఇచ్చారని ఆమె ధ్వజమెత్తారు.

అయితే.. మే 13న జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కడప లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ పడనుండగా.. మాజీ కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లం రాజు , బాపట్ల నుంచి కాకినాడ నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. రాష్ట్రానికి చెందిన ఐదుగురితో సహా లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం.. గిడుగు రుద్రరాజు రాజమండ్రి నుండి పోటీ చేయనున్నారు. జాబితా ప్రకారం కర్నూలు నుంచి పార్టీ అభ్యర్థిగా పీజీ రాంపుల్లయ్య యాదవ్‌ బరిలోకి దిగనున్నారు.
Read Also : Pushpa 2 : తగ్గేదెలే.. పుష్ప-2 ది రూల్ టీజర్.. ఎప్పుడంటే..?