Site icon HashtagU Telugu

YS Sharmila: పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్న షర్మిల

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు హఠాత్తుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసి వచ్చింది. గృహనిర్బంధం చేయనున్న క్రమంలో ఆమె తన పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్నారు. దీనికి సంబందించిన ఫొటోస్, వీడియోస్ వైరల్ గా మారాయి.

వాస్తవానికి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ‘చలో సచివాలయ’ నిరసనను నిర్వహించాలని ప్రకటించింది. దీని కారణంగా గృహనిర్బంధం నుండి తనను తాను రక్షించుకోవడానికి పార్టీ కార్యాలయంలోనే ఉండవలసి వచ్చింది. నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ‘చలో సచివాలయ’ నిరసనకు పిలుపునిచ్చింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో యువత, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు.

నిరుద్యోగుల పక్షాన మేం నిరసనకు పిలుపునిస్తే మమ్మల్ని గృహనిర్భంధం చేసేందుకు ప్రయత్నిస్తారా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మనకు లేదా? ఒక మహిళగా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, అరెస్టు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే రాత్రంతా గడపాల్సి రావడం సిగ్గుచేటు కాదా? అని ప్ప్రశ్నించారు. ప్రజలు తరుపున పోరాడే వారు ఉగ్రవాదులా.. లేక సంఘ వ్యతిరేక శక్తులా? మమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారామె. మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు అంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందా అని ప్రశ్నించారు. తమ అసమర్ధతను, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని, మా కార్యకర్తలను ఆపాలని ప్రయత్నించినా, నిరుద్యోగుల పక్షాన మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. మా చుట్టూ వేలాది మంది పోలీసులను మోహరించారు. ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు అండగా నిలబడితే అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న నియంతవి నువ్వు. మీ చర్యలే ఇందుకు నిదర్శనం అని షర్మిల వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

Also Read: Kannappa: ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ.. పార్వతిగా కనిపించనున్న ఫైర్ బ్రాండ్.. ?