Tirumala Laddu Controversy: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. రిపోర్ట్ వచ్చి చాలారోజులు అవుతున్నా… ఇన్నిరోజులు ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేశారని ఆరోపించారు. కేవలం రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టే వందరోజుల సెలబ్రేషన్స్‌లో భాగంగా చంద్రబాబు చెప్పారా అని ప్నశ్నించారు. లేదంటే దీని సివియారిటీ ముందు తెలిస్తే… ఎంక్వైరీ ఎందుకు వేయలేదు.
Read Also: Spider JCB: స్పైడర్ జేసీబీ మెషిన్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది?
చంద్రబాబు వందరోజుల పరిపాలన మీద జనాలు ఓ రిపోర్ట్ ఇస్తారు కాబట్టే… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాలు బయటకు చెప్పారా. ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని.. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని… మినిస్టర్ ఆఫ్ హోం ఎఫైర్స్‌కు లేఖ రాశామన్నారు. సీబీఐ విచరాణ జరగకపోతే.. అసలు దోషులు ఎవరో బయటకు రానున్నారు. తప్పు జరిగుంటే.. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ హోం మినిస్టర్ అమిత్ షాకు లేఖ రాశామన్నారు.
వందరోజుల్లో చంద్రబాబు ఏం చేశారంటే.. శిశిపాలుడి తప్పులు లేక్కపెట్టినట్లు.. జగన్ మోహన్ రెడ్డి అవినీతిని, తప్పులను… చంద్రబాబు ఎత్తి చూపించారన్నారు. వైఎస్ విగ్రహాలను, పేర్లను ఎక్కడి పడితే అక్కడ తొలగించారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. హామీల విషయంలో చంద్రబాబు చేసింది జీరో అనే చెప్పాలన్నారు వైఎస్ షర్మిల. వారు చేసిన వాగ్ధానాలు సూపర్ సిక్స్. వందరోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. కానీ వంద రోజులు దాటిన ఇప్పటివరకు సూపర్ సిక్స్‌లో ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదన్నారు. మోడీ డైరెక్షన్‌లో చంద్రబాబు వందరోజుల సినిమా అట్టర్ ప్లాప్ అయిందని వైఎస్ షర్మిల అన్నారు.