Site icon HashtagU Telugu

YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తో పాటు తన భర్త, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు, ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నిర్ధారించారని ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలు రాజకీయ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ షర్మిలా తన ఫోన్, భర్త ఫోన్, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి, ట్యాప్ చేసిన ఆడియోను వినిపించి ఈ విషయాన్ని నిర్ధారించారని ఆమె తెలిపారు. “ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇది ముమ్మాటికీ నిజం,” అని షర్మిలా పేర్కొన్నారు. అయితే, సుబ్బారెడ్డి ఇప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా అనేది అనుమానమేనని ఆమె అన్నారు.

షర్మిలా ఆరోపణల ప్రకారం.. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మధ్య సన్నిహిత సంబంధం నేపథ్యంలో జరిగింది. “వారి సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ట్యాపింగ్ తనను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు.

షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని జగన్ అడ్డుకోవాలని చూశారని, తన అనుచరులను బెదిరించి, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధంగా ఉపయోగించారని ఆరోపించారు. “నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశాను, కానీ ప్రతి అడుగులో అడ్డుపడ్డారు,” అని ఆమె తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేసి, తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక జగన్ , కేసీఆర్ మధ్య జాయింట్ ఆపరేషన్ ఉందని షర్మిలా ఆరోపించారు. “వారు చేసిన అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది,” అని ఆమె అన్నారు. ఈ కేసులో విచారణకు ఎక్కడికైనా వెళ్తానని, ఏ విచారణనైనా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు.

షర్మిలా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కోరారు. “ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ కేసుపై చర్యలు తీసుకోవాలి,” అని ఆమె డిమాండ్ చేశారు. తనకు వ్యక్తిగత గజ్ లేదని, జగన్ తనపై ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడు కూడా తాను కేసు వేయలేదని ఆమె తెలిపారు.

Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు