AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టిందో లేదో.. షర్మిల (Sharmila) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. సోమవారం బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై , టీడీపీ ఫై తనదైన శైలిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అన్న జగన్ (Jagan) ఫై , పార్టీ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెలరేగి వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు నింపింది. అంతే కాదు ఈరోజు ఉత్తరాంధ్ర యాత్ర కూడా మొదలుపెట్టి..మరోసారి వైసీపీ (YCP)నేతలకు సవాల్ విసిరింది. ఇలా సాయంత్రం ఏకంగా మాజీ మంత్రిని కలిసి షాక్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం సాయంత్రం వైఎస్ షర్మిల విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna)తో భేటీ అయ్యారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిలో రామకృష్ణ ఒకరు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ తరువాత వైసీపీలోనూ కొన్నాళ్లపాటు పని చేశారు. రాజకీయంగా జగన్‌తో విబేధించిన ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ అయిన కొణతాల రామకృష్ణ రీసెంట్ గా జనసేన (Janasena)లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఆయనతో భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈ భేటీ విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొణతాల రామకృష్ణను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే వ్యూహంలో భాగంగా ఆమె కొణతాల రామకృష్ణతో భేటీ అయినట్టుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. మొత్తంగా ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టిన వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వేసే ప్రతీ అడుగును రాజకీయ వర్గాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
Read Also : Ayodhya : అయోధ్య పేరుతో కొత్త మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు