వైస్ షర్మిల (YS Sharmila )..మరికాసేపట్లో తన అన్న జగన్ మోహన్ రెడ్డి (Jagan) ని కలవబోతున్నారు. గత కొద్దీ నెలలుగా జగన్ తో మాట్లాడకుండా..కలవకుండా ఉన్న షర్మిల..ఇప్పుడు స్వయంగా ఆమె తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి కలుస్తుండడం తో ఆసక్తి గా మారింది. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి, అక్కడి నుంచి తాడేపల్లి గూడెంలోని సీఎం ఇంటికి షర్మిల చేరుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
షర్మిల కుమారుడు రాజారెడ్డి (Rajareddy) ఎంగేజ్‌మెంట్ జనవరి 18న అట్లూరి ప్రియతో జరగనుండగా వివాహం ఫిబ్రవరి 17న ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వివాహ ఆహ్వాన పత్రిక (Wedding Card)ను షర్మిల అందజేయనున్నట్లు సన్నిహితులు తెలిపారు. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి షర్మిల నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక జగన్ ను షర్మిల కలవడం వెనుక ఎలాంటి రాజకీయ వ్యూహాలు లేవు..జస్ట్ తన కుమారుడి పెళ్లి కార్డు ను అందజేయడమే తప్ప మరోటి లేదు. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం ఫిక్స్.. అధిష్టానం నుంచి ఆహ్వానం వచ్చిందని కూడా స్వయంగా మంగళవారం నాడు ఇడుపులపాయ వేదికగా షర్మిలనే ప్రకటించారు. రేపు కాంగ్రెస్ అగ్ర నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుంది షర్మిల.
ఇక రాజారెడ్డి విషయానికి వస్తే.. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియాను.. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించి.. పెళ్లి చేసుకోబోతున్నాడు. న్యూ ఇయర్ రోజున ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షర్మిల ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర శుభలేఖను ఉంచి, ప్రార్థనలు చేసి.. తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడే ఉన్న షర్మిల బుధవారం మధ్యాహ్నం నేరుగా ఇడుపులపాయ నుంచి నేరుగా తాడేపల్లికి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉంటారని తెలుస్తోంది. అన్నకు శుభలేఖ ఇచ్చి.. కుమారుడి వివాహానికి ఆహ్వానించబోతున్నారు. ఈ భేటీ అనంతరం విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు.
Read Also :