YS Sharmila : షర్మిల ఫిక్స్ అయ్యిందా..?

కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచనా మేరకు ఆమె కడప ఫిక్స్ అయిందని అంటున్నారు

Published By: HashtagU Telugu Desk
Kadapa Sharmila

Kadapa Sharmila

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..కడప (Kadapa) నుండి పోటీ చేసేందుకు ఫిక్స్ అయినట్లే అనే అవుననే చెప్పాలి. తాజాగా సార్వత్రిక ఎన్నికల తాలూకా షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇక ఏపీ విషయానికి వస్తే..ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ , టీడీపీ కూటమి లు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా..కాంగ్రెస్ పార్టీ మరో రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే షర్మిల కడప లోక్ సభ (Lok Sabha) లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. . కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచనా మేరకు ఆమె కడప ఫిక్స్ అయిందని అంటున్నారు. ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అధిష్టానం సీటివ్వదని పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ జగన్ మాత్రం అటు తిరిగి.. ఇటు తిరిగి అవినాశ్‌కే టికెట్ ఇచ్చారు. ఆయనపై వ్యతిరేకతతో కచ్చితంగా కాంగ్రెస్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని హైకమాండ్ గట్టి నమ్మకంతో ఉందట. ఈరోజు గురువారం కడప నేతలతో షర్మిల భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతోంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Read Also : Vijay Antony: వివాదంలో హీరో విజయ్ ఆంటోనీ.. మండిపడుతున్న క్రైస్తవులు?

  Last Updated: 21 Mar 2024, 10:25 AM IST