Site icon HashtagU Telugu

YS Sharmila : జనవరి ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ లోకి షర్మిల..?

YS Sharmila meeting with Congress DK Shivakumar and Congress new plan for ap

YS Sharmila meeting with Congress DK Shivakumar and Congress new plan for ap

YSRTP అధినేత్రి వైస్ షర్మిల (YS Sharmila )..కాంగ్రెస్ (Congress) గూటికి చేరేందుకు సిద్ధమైంది..ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందే తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..కాంగ్రెస్ నుండి పోటీ చేయాలనీ భావించింది. చివరి వరకు గట్టిగానే ట్రై చేసింది కానీ..తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆమె చేరికకు బ్రేకులు పడ్డాయి. ఇక ఇప్పుడు అంత సెట్ అవ్వడం..కాంగ్రెస్ కూడా తెలంగాణ లో భారీ మెజార్టీ తో విజయం సాధించడం తో ..ఇక షర్మిల చేరికకు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ పడినట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి ఫస్ట్ వీక్ లో మంచి ముహూర్తం చూసుకొని ఢిల్లీ(Delhi) వేదికగా షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. షర్మిల ను ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వాడుకునేందుకు చూస్తుంది. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడి రాజకీయాలు మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ ఇంచార్జులను మార్చడంతో పాటు చాలా మంది సిట్టింగులకు టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. అటు టీడీపీ కూడా ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో సమావేశమై సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ షర్మిల ను తమ పార్టీ లోకి తీసుకొని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ప్రకటించాలని చూస్తుంది.

ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏపీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఈ సారి చెప్పుకోదగ్గ సీట్లన్న సాధించాలని కాంగ్రెస్ చూస్తుంది. షర్మిల కు కాంగ్రెస్ పగ్గాలను అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుందని అధిష్టానం భావిస్తోంది. వైఎస్సార్ చరిష్మాతో ఆయన బిడ్డగా షర్మిల పేరు పార్టీకి కలిసొస్తుందని లెక్కలు వేస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్, సోనియా గాంధీలతో షర్మిల చర్చలు జరిపారని సమాచారం.

Read Also : KA Paul Offer to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు భారీ ఆఫర్ ఇచ్చిన KA పాల్..