YS Sharmila : జగన్ కు షర్మిల బహిరంగ లేఖ…

వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకు కొనసాగిన 28 పథకాలను, మీరు అధికారంలోకి రాగానే నిర్లక్ష్యంగా నిలిపివేశారని షర్మిల ఆరోపించారు

  • Written By:
  • Publish Date - May 1, 2024 / 12:50 PM IST

వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) కు..ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) బహిరంగ లేఖ (Letter ) రాసింది. కాంగ్రెస్ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి జగన్ ను టార్గెట్ గా పెట్టుకున్న షర్మిల..ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మరింత ఘాటైన విమర్శలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా బహిరంగ లేఖ రాసి..అందులో అనేక అంశాలను ప్రస్తావించింది.

We’re now on WhatsApp. Click to Join.

“ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా ? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు ? 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు ? ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది ? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు ? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు ? ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా ? డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు ? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ?” అంటూ లేఖలో ప్రశ్నలు సంంధించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకు కొనసాగిన 28 పథకాలను, మీరు అధికారంలోకి రాగానే నిర్లక్ష్యంగా నిలిపివేశారని షర్మిల ఆరోపించారు. దళితులపై దాడులు, దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్టే ఉన్నారని, దాడులు నివారించి దళితులను కాపాడే నిర్దిష్ట చర్యలు లేవని సీఎం జగన్ ను విమర్శించారు. దాడులు చేసేవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లేనని, ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈమె ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెపుతుందా..? అనేది చూడాలి.

Read Also : Raashii Khanna : అందమైన రాశి అందాల ఆరబోత