Site icon HashtagU Telugu

YS Sharmila : ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి: వైఎస్‌ షర్మిల

YS Sharmila Comments

YS Sharmila Comments

YS Sharmila inspected the submerged crops : ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఎకరాకు కనీసం రూ.20 నుంచి 25 వేల చొప్పున నష్టపరిహారం రైతులకు అందించాని సీఎం చంద్రబాబును డిమాండ్‌ చేశారు. దివంగత వైఎస్‌ఆర్‌ ఏలేరు రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారని, తదుపరి సీఎంలు ఎవరూ దీనిని పట్టించుకోలేదని విమర్శించారు.

Read Also: Cyberabad CP Office : సైబరాబాద్ ఆఫీస్ కు హరీష్ రావు..పాడి కౌశిక్

”భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్‌కు వరద పెరగడంతో కిందనున్న వందలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టి నష్టపోయారు. దాదాపు 6లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చెప్పారు. కావున నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.20-25వేలు ఇవ్వాలి. వైఎస్ఆర్ ఏలేరు రిజర్వాయర్‌ ఆధునీకకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం తర్వాత పనిచేసిన సీఎంలు దీనిని పట్టించుకోలేదు. మెయింటెనెన్స్ చేయలేదు. దీంతో పొలాలు నీటమునిగి రైతులు రోడ్డున పడ్డారు. వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25వేలు పరిహారం ఇవ్వడంతో పాటు ఏలేరు, మిగిలిన ప్రాజెక్టుల మెయింటెనెన్స్, కాలువల పూడికతీత పనులు చేపట్టాలి” అని షర్మిల డిమాండ్‌ చేశారు.

Read Also: Space Walk : చరిత్రలో తొలిసారిగా స్పేస్ వాక్.. పొలారిస్‌ డాన్‌ మిషన్‌‌ సక్సెస్