YS Sharmila: పులివెందుల సభలో స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన వైఎస్ షర్మిల

ఏపీ రాజకీయంలో వైఎస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రస్తుతం పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాంగా ఆమె ఎమోషనలయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్, మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.

YS Sharmila: ఏపీ రాజకీయంలో వైఎస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రస్తుతం పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాంగా ఆమె ఎమోషనలయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్, మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.

కడప జిల్లాలో పర్యటించారు కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల ఇప్పుడు తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గం అయిన పులివెందుల నియోజకవర్గంపై దృష్టి సారించారు. కడప జిల్లాలోని వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, పులివెందుల సహా పలు కీలక ప్రాంతాలను ప్రచారం చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు వేంపల్లెలో బహిరంగ సభ జరగగా, సాయంత్రం 7 గంటలకు పులివెందుల పూలతోటలో బహిరంగ సభ జరగనుంది. వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయ కంచుకోట అయిన పులివెందులలో షర్మిల హాజరుకావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఎన్నికల రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆమె ప్రచార ప్రయత్నాలు ఊపందుకున్నాయి మరియు ఆమె ఓటర్లతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నారు.

We’re now on WhatsApp : Click to Join

తన బాబాయ్ వివేకాని హత్య చేసిన వాడికి టికెట్ ఇచ్చి అధికారం అడ్డుపెట్టుకుని కాపాడుతున్నారని సీఎం జగన్ పై మండిపడ్డారు షర్మిల. సొంత బాబాయికి న్యాయం చేయకపోతే ప్రజలకేం న్యాయం చేస్తావ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారమే. హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా న్యాయం జరగలేదని ఎమోషనల్ అయ్యారు.నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే ఒక హంతకుడిని కాపాడతారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కడప అభ్యర్థుల్లో ఒకరు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు ఉన్నారని, కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాని, తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైఎస్ షర్మిల.

Also Read: Kavitha: కవితకు చుక్కెదురు.. రెండు పిటిషన్లను కొట్టేసిన కోర్టు