మొన్నటి వరకు మూడు రాజధానులంటూ ముచ్చట చెప్పిన..వైసీపీ (YCP) ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయానికి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి తీసుకరావడం ఫై ప్రతిపక్ష పార్టీలు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు వైసీపీ నేతలపై మండిపడగా..తాజాగా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల(YS Sharmila ) తనదైన శైలి లో విమర్శలు చేసింది. మరో రెండేళ్లు ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమిట్లా..? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? ఐదేళ్లు అధికారి ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేసారా..? అని వైసీపీ ప్రభుత్వాని షర్మిల ప్రశ్నించింది. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదని.. ఉన్నవి కూడా ఉంటాయో, లేదో తెలియని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని మోడీకి మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే.. మీ చేతకాని తనానికి విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక ప్యాకేజీలు లేదు, పోలవరం పూర్తి కాలేదు మరి ఐదేళ్లు ఏం చేశారని అన్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3డీ గ్రాఫిక్స్ అయితే.. మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అంటూ ఎద్దేవా చేశారు.
Read Also : Renuka Chowdhury : బ్యారేజ్ లు కూలుతుంటే…బిఆర్ఎస్ డ్రామాలు చేస్తుంది – రేణుకా చౌదరి