Ys Sharmila Fires On PM Modi : ‘మోడీ రింగ్ మాస్టర్’ అంటూ షర్మిల ఫైర్

అటు జగన్, ఇటు బాబును రెండు పంజరాల్లొ పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ

  • Written By:
  • Publish Date - March 17, 2024 / 11:36 PM IST

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Ys Sharmila Fires On PM Modi )…మరోసారి ప్రధాని మోడీ ఫై విమర్శలు కురిపించింది. ఏపీలో మరో 55 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అనే ఉత్కంఠ గా ఉండబోతున్నాయని అర్ధం అవుతున్నాయి. వైసీపీ ని గద్దె దించేందుకు అన్ని పార్టీ సన్నాహాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ , మిత్ర పార్టీలు జంటగా బరిలోకి దిగుతుంటే, టిడిపి , జనసేన , బిజెపి జంటగా దిగుతున్నాయి. ఈ క్రమంలో నేడు చిలకలూరిపేటలో ఎన్డీయే కూటమి ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో భారీ సభను నిర్వహించింది.

ఈ సభకు ప్రధాని మోడీ (Modi) ముఖ్య అతిధిగా హాజరు కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) లతో పాటు మూడు పార్టీలకు సంబదించిన నేతలు , పార్టీకార్యకర్తలు , అభిమానులు ఇలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభపై అధికార పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శలు చేయడం మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల తన ట్విట్టర్ లో ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధించింది. సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. వైసీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, రెండు ఒకటేనని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనే ఉద్దేశంతోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ప్రధాని విమర్శలపై షర్మిల రియాక్టయ్యారు. జగన్, చంద్రబాబును చెరోవైపు పెట్టుకుని ఆడిస్తూ తమపై విమర్శలు చేయడం ఏమిటని షర్మిల ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ హామీ బీజేపీకి వణుకు తెప్పిస్తోందని షర్మిల సెటైర్లు వేశారు.

” అటు జగన్, ఇటు బాబును రెండు పంజరాల్లొ పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ. పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా. కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ళ అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందిస్తూ, ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పుతెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో. బీజేపీ ప్రతి బిల్లుకు పార్లమెంటులో సిగ్గువిడిచి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి సర్కారు, మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టపెట్టి, వారికీ రాజ్య సభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం. ” అని షర్మిల ట్వీట్ చేశారు.

Read Also : Modi Stopped The Pawan Speech : పవన్ కళ్యాణ్ స్పీచ్ కు మోడీ అడ్డు..అసలు ఏంజరిగిందంటే..!!