Site icon HashtagU Telugu

YS Sharmila : ఏపీలో మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఉంది

Ys Shermila

Ys Shermila

ప్రచారలతో ఏపీ ఎన్నికల్లో హీటు పెరిగింది. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయా పార్టీల నేతలు ముందుకు సాగుతున్నారు. వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేస్తూ రంగంలోకి దిగిన ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. రోజు రోజుకు వైఎస్‌ జగన్‌పై ఆమె డోసు పెంచుతూ విమర్శలకు దిగుతున్నారు. ప్రజల్లో వైఎస్‌ జగన్‌పై వ్యతిరేకతను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేడు కర్నూలు జిల్లాలోని ఆలూరులో వైఎస్ షర్మిల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. ఏపీ లో మద్యం మాఫియా,మట్టి మాఫీయా,ఇసుక మాఫియా ఉందని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని ఆయన మండిపడ్డారు. ఆలూరులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇక్కడ చెత్త తీసి వేరే చోటకి పంపాడట అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఈ నియోజక వర్గానికి పనికి రాడని వేరే నియోజక వర్గం ఇచ్చాడట, ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికి వస్తాడు ? కార్మిక శాఖ మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా ? అని వైఎస్‌ షర్మిల రెడ్డి ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా.. ఆలూరు నియోజక వర్గంలో మొత్తం దోపిడీ అంట కదా అంటూ ప్రజలతో ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని జగన్ హామీ ఇచ్చాడు, 5 ఏళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క అడుగు పడలేదని ఆమె అన్నారు. 2008లో వైఎస్ఆర్ శిలాఫలకం వేశారని, అదే ప్రాజెక్ట్ కి జగన్ మోహన్ రెడ్డి మరో శిలాఫలకం వేశారని చురకలు అంటించారు వైఎస్‌ షర్మిల. జగన్ ప్రభుత్వం శిలాఫలకం ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టి ఉంటే 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేదని ఆమె వెల్లడించారు. ఆలూరు నియోజక వర్గంలో టమాటా ఎక్కువ పండుతుంది, రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు..కట్టలేదని షర్మిల మండిపడ్డారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ధర స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశాడని షర్మిల నిప్పులు చెరిగారు. రైతును YSR రాజును చేశాడు, ఇప్పుడు రైతు అప్పుల పాలు అయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖులకు, అహంకారులకు ఓటు వేయ వద్దని ఆమె ప్రజలను కోరారు. మీ ఓటు వృధా కానివ్వొద్దని ప్రజలకు ఆమె విన్నవించారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీ లో వేసినట్లే, ఈ సారి ఆలోచన చేసి ఓటు వేయండని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.. హోదా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆమె అన్నారు.
Read Also : Vijayashanti : విజయశాంతిని దురదృష్టం వెంటాడుతుందా.?

Exit mobile version