YS Sharmila : 2024 మేనిఫెస్టో లో ప్రత్యేక హోదా ప్రస్తావన ఏది?

సీఎం జగన్ 2019 మేనిఫెస్టో లో ప్రవేశ పెట్టి నెరవేర్చని అంశాలు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల అన్నారు.

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 11:24 AM IST

సీఎం జగన్ 2019 మేనిఫెస్టో లో ప్రవేశ పెట్టి నెరవేర్చని అంశాలు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల అన్నారు. ఇవాళ ఆమె విశాఖలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె అన్నారు. 2024 మేనిఫెస్టో లో ప్రత్యేక హోదా ప్రస్తావన ఏది? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ మెడలు వంచి అయినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మీరు చేసింది ఏంటి అని, పోలవరం సంగతి ఏమైంది? అని షర్మిల మండిపడ్డారు. మూడు రాజధానులు ఏమయ్యాయని, పూర్తి మధ్యపానం నిషేధం అని చెప్పి మాట తిప్పారన్నారు వైఎస్‌ షర్మిల. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఎలక్షన్స్ లో ఓట్లు అడుగుతారని, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అనేక బ్రాండ్స్ తీసుకొచ్చారని ఆమె మండిపడ్డారు. అవి తాగి రాష్ట్రంలో 25 శాతం మంది ప్రజలు లిక్కర్ తాగి చనిపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వమని ఆమె ధ్వజమెత్తారు. జాబ్ కాలెండర్ సంగతి ఏమైందని, 5 ఏళ్ళల్లో ఒక్క జాబ్ కాలెండర్ కూడా రాలేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా..’2 లక్షలు 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి భర్తీ చేయలేదు. మీ కార్యకర్తలు కు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ప్రభుత్వ ఉద్యోగాలు అని మభ్యపెడుతున్నారు. జలయజ్ఞం తో పాటు 54 ప్రాజెక్టు లు రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు… ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టు లు పూర్తి చేశారు? జేడీ లక్ష్మీ నారాయణ ప్రస్తుతం ఒక పార్టీ అధినేత. కనుక వారి వాక్యాలకు రాజకీయ నేపథ్యం సందేహాలు ఉంటాయి. పొన్నవోలు సుధాకర్ ఇయానేమి లాయర్. సీబీఐ రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్ రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చారు. రాజశేఖర్ రెడ్డి పేరు లేక పోతే జగన్మోహన్ రెడ్డి బయట పడరు అని ఈ పని చేశారు. వై ఎస్ ఆర్ అంటే అభిమానం, గౌరవం ఉందని చెప్పి పొన్నవోలు సుధాకర్ వై ఎస్ ఆర్ పేరు చేర్చాలని అన్ని కోర్ట్ లు చుట్టూ తిరిగారు. జగన్మోహన్ రెడ్డి బయట పడటం కోసం రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చినందుకు బహుమతి గా పొన్నవోలు కు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు.

అత్యంత మేలు చేశారు కనుక ఏఏజి పదవి నీ పొన్నవోలు కు వారం లోనే బహుమతి గా ఇచ్చారు… పొన్నవోలు కు టాలెంట్ ఎక్కడ ఉంది, స్వామి భక్తి కి ఏ ఏ జి పదవి ఇచ్చారు. ఈ అంశాలు నాకు ముందు తెలియదు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసినప్పుడు వారే ఈ సీబీఐ కేసు లో వై ఎస్ ఆర్ పేరు పెట్టిన అంశం చెప్పారు. రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిస్థితులు మార్చారు. వారి తండ్రిని చంపిన వారిని కూడా క్షమించి విడిచిపెట్టిన వారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. హత్య ల చేసిన వారికే పదవులు ఇస్తున్నారు. రాజారెడ్డి నీ చంపిన సతీష్ రెడ్డి కి జగన్ ప్రోత్సహిస్తున్నారు. అవినాష్ చిన్నపిల్లాడు కాదు సీబీఐ బయట పెట్టిన అంశాలు బట్టి మేము మాట్లాడుతున్నాను..’ అని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : AP Pension : ఆంధ్రాలో మళ్లీ పెన్షన్ టెన్షన్.!