Site icon HashtagU Telugu

YS Sharmila : బీజేపీ తొత్తు పార్టీ.. తోక పార్టీ వైసీపీ – వైఎస్ షర్మిల

Sharmila Kadapa

Sharmila Kadapa

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల (YS Sharmila) కూటమి సర్కార్ (AP NDA Govt) తో పాటు బిజెపి (BJP) , వైసీపీ (YCP) పార్టీల ఫై విరుచుకుపడింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి నెల రోజులు అవుతుంది కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామని హామీ ఇచ్చారు..మరి అది ఇంకా ఎందుకు అమలు చేయడం లేదో అర్ధం కావడం లేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక , తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన రెండో రోజే కీలక హామీలను కాంగ్రెస్ పార్టీలు హామీలు చేసారు. అలాంటిది ఏపీలో మాత్రం కూటమి కీలక హామీలను అమలు చేయడం లేదన్నారు. త్వరగా చంద్రబాబు హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే సందర్బంగా మాజీ సీఎం జగన్ ఫై కూడా విమర్శల వర్షం కురిపించింది. ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉందని, మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పడేసాడని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడం ప్రస్తుత ముఖ్యమంత్రికి కష్టసాధ్యమైన పనేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది వైసిపి అని, బిజెపి తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతు తెలిపింది వైసిపి అని బిజెపితో వైసిపి అక్రమ సంబంధం పెట్టుకుందని, బీజేపీ తొత్తు పార్టీ.. తోక పార్టీ వైసీపీ అని షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేసారు. అలాగే తన తండ్రిపై ప్రేమ ఉంటె 75వ జయంతి రోజు జగన్ ఏం కార్యక్రమాలు చేశారో చెప్పాలో అని డిమాండ్ చేసారు. వందల కోట్లు సిద్ధం సభలకు ఖర్చుపెట్టిన మీరు వైస్సార్ జయంతికి ఏం చేశారు అని నిలదీశారు. వైయస్సార్ ఘాట్ వద్ద ఐదు నిమిషాలు తూతూ మంత్రంగా నివాళులర్పిస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు.

Read Also : IND vs ZIM: నాలుగో మ్యాచ్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి