AP : జగన్, అవినాష్ లను ఓడించాలని షర్మిల పిలుపు

నిన్నటి వరకు జనసేన , టిడిపి నేతలు మాత్రమే జగన్ శవ రాజకీయాల ఫై బాణాలు సందించగా..ఇప్పుడు సొంత చెల్లెలు సైతం మొదలుపెట్టింది

Published By: HashtagU Telugu Desk
Sharmila Ap

Sharmila Ap

ఎన్నికల ప్రచారంలోకి షర్మిల (Sharmila) దిగడమే కాదు..అన్న జగన్ ఫై విమర్శల వర్షం కురిపిస్తూ వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తుంది. నిన్నటి వరకు జనసేన , టిడిపి నేతలు మాత్రమే జగన్ శవ రాజకీయాల ఫై బాణాలు సందించగా..ఇప్పుడు సొంత చెల్లెలు సైతం మొదలుపెట్టింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడం తో రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారాన్ని స్పీడ్ చేయగా…లేటుగా వచ్చిన తనదైన విమర్శలకు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది షర్మిల.

వైఎస్సార్ జిల్లాలో సోదరి సునీతతో కలిసి షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటే సీఎం జగన్, అవినాష్ లను ఓడించాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని..ధర్మం కోసం ఒకవైపు తాను… డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వివేకా హత్య కేసు నిందితుడికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకు సీఎం జగన్ తన పదవిని వాడుకుంటున్నారని షర్మిల దుయ్యబట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం.. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో కడప నుంచి పోటీ చేస్తున్నానని స్పష్ట చేసారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని… పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. ఇదిలా ఉంటె కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్లో చేరారు. ఆమెకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ఆమె వైసీపీకి రాజీనామా చేసి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా జగన్ అవమానించారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Read Also : Viral Video: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుద్దిన గంగిరెద్దు.. తప్పిన ప్రమాదం, వీడియో వైర‌ల్‌

  Last Updated: 05 Apr 2024, 05:52 PM IST