Site icon HashtagU Telugu

Runa Mafi : సీఎం చంద్రబాబు కు కొత్త తలనొప్పిని తీసుకొచ్చిన వైస్ షర్మిల

Cbn Sharmila

Cbn Sharmila

తెలంగాణ సర్కార్ (Telangana Govt) రుణమాఫీ (Runa Mafi ) ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు (Farmers and Congress Ranks) సంబరాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని , సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి చేశారని కొనియాడుతూ.. స్వీట్లు తినిపించుకుని డాన్సులు చేస్తున్నారు. గురువారం రూ. లక్ష వరకు లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6,098 కోట్లు జమ చేసింది.

తెలంగాణ సర్కార్ చేసిన ఈ గొప్ప పనికి దేశం మొత్తం మాట్లాడుకుంటూ సీఎం రేవంత్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల..సీఎం చంద్రబాబు కు తలనొప్పిగా మారింది. ట్విట్టర్ వేదికగా రుణ మాఫీ ఫై షర్మిల (YS sharmila) స్పందిస్తూ..

“15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అన్నారు. రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణమన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజని, తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

ఇక చంద్రబాబు కూడా ఏపీలో రుణమాఫీ చేయాలనీ ఈ సందర్బంగా షర్మిల డిమాండ్ చేసారు. రైతుల తలసరి అప్పులో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఏపీలో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరని ప్రశ్నించారు. ప్రతీ రైతు నెత్తిన 2.5 లక్షల రుణం కత్తిలా వేలాడుతోందని, గత దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం, వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు మీ చేతులో ఉంది కాబట్టి ఎందుకు రుణమాఫీ చేయకూడదని చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలని పేర్కొన్నారు.

Read Also : Venu Swami : బిగ్ బాస్ 8 లో వేణు స్వామి.. భారీ రెమ్యునరేషన్..?

Exit mobile version