YS Sharmila : వైసీపీ వాళ్లు నేను చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి – YS షర్మిల

వైసీపీ నేతలకు కళ్లు, చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే... మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి

Published By: HashtagU Telugu Desk
Sharmila Kadapa

Sharmila Kadapa

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల (YS Sharmila) మరోసారి వైసీపీ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. ఏపీలో వైసీపీ నేతల (YCP Leaders) తీరు పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉందని , సాక్షి పత్రికలో తల్లికి వందనం కథనంపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ను తోక పార్టీ అని కామెంట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం తల్లికి వందనం పథకం అమలుపై షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటు టీడీపీ, బిజెపి తో పాటు ఇటు వైసీపీ..పార్టీలపైనా విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సైతం విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అయితే వైసీపీ కౌంటర్లకు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.

“పచ్చకామెర్లు ఉన్నవారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ నేతల తీరు ఉంది. తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే.. బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. వైసీపీ నేతలకు కళ్లు, చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే… మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి. తల్లికి వందనం GO 29 క్లారిటీ లేదని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేస్తే .. కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కనుకే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది” అని షర్మిల ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

” ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది? వైసీపీ నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ ముక్క పట్టుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా? అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా? అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా? నేను వైసీపీ కోసం బై బై బాబు క్యాంపెయిన్ చేయడం ఎంత నిజమో.. అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. మరి మీకు రూ. 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు?” అని షర్మిల ట్వీట్ చేశారు.

Read Also : Endowment Assistant Commissioner : భర్త విదేశాల్లో..ఏపీలో భార్య గర్భం..వైసీపీ ఎంపీఫై పిర్యాదు

  Last Updated: 13 Jul 2024, 07:12 PM IST