YS Sharmila : వైఎస్సార్ ను తిట్టిపోసిన బొత్స..తండ్రి సమానుడా ?..జగన్ ఫై షర్మిల ఎటాక్

అసెంబ్లీ లో వైఎస్సార్ ను త్రాగుబోతు అని ..జగన్ కు ఉరి శిక్ష వేయాలని .. విజయమ్మ ను సైతం అవమాన పరిచిన ఈ బొత్స సత్యనారాయణ తండ్రి సమానుడా..జగన్ ..? అంటూ షర్మిల ఎటాక్

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 04:45 PM IST

విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham) సభలో జగన్ (Jagan) మాట్లాడుతూ.. ‘బొత్స (Botsa Satyanarayana) నా తండ్రి లాంటి వారు. ఆయన్ను చీపురుపల్లిలో గొప్ప మెజార్టీతో గెలిపించాలి’ అని అనడం ఫై వైస్ షర్మిల (YS Sharmila) ఘాటైన విమర్శలు చేసింది. అసెంబ్లీ లో వైఎస్సార్ (YS Rajasekhara Reddy) ను త్రాగుబోతు అని ..జగన్ కు ఉరి శిక్ష వేయాలని .. విజయమ్మ ను సైతం అవమాన పరిచిన ఈ బొత్స సత్యనారాయణ తండ్రి సమానుడా..జగన్ ..? అంటూ షర్మిల ఎటాక్ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచరాసభ నిర్వహించారు షర్మిల. ఈ సభలో జగన్ పై విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే బొత్స వైస్సార్ ను , విజయమ్మను ఏ విధంగా తిట్టాడో..ఎన్ని మాటలు అన్నాడో..విజయమ్మ ను సైతం ఏ విధంగా అవమానించాడో జగన్ మరచిపోవచ్చు కానీ..నేను మరచిపోను..అంటూ గతంలో బొత్స చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే బొత్స .వైస్సార్ ను పట్టుకొని తాగు బోతు అని తిట్టారు.. ఇదే బొత్స జగన్ కు ఉరి శిక్ష వేయాలని అన్నాడు… ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మను కూడా బొత్స అనేక మాటలు అన్నారన్నారు. అలాంటి బొత్స . . ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాన్నలాంటి వారయ్యారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క బొత్స మాత్రమే కాదని ఇప్పుడు జగన్ మంత్రి వర్గంలో వైఎస్ఆర్ ను అభిమానించే వారే లేరన్నారు. వైఎస్ పై అభిమానం ఉన్న వాళ్లు.. ఆయనను గౌరవించేవారు కేబినెట్ లో లేరన్నారు. మంత్రులు అందరూ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్లేనన్నారు. వైఎస్ ను తిట్టిన వాళ్లే మంత్రులుగా ఉన్నారన్నారు.

వైఎస్ ను తిట్టిన వాళ్ళకే జగన్ పెద్దపీట వేశారని షర్మిల విమర్శించారు. వీళ్ళందరూ తండ్రులు,అక్కలు,చెల్లెల్లు అన్నారు. నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్ళు ఈయనకు ఏమి కారన్నారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ కారన్నారు. ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమి కారన్నారు. అసలు వైఎస్సార్సీపీ పార్టీలో వైఎస్సార్ లేడని షర్మిల ఆరోపించారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి , ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డిని తిట్టిన రోజా, బొత్స సత్యనారాయణ, విడదల రజినీలను జగన్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Read Also : Key Candidates : ఈనెల 26న రెండో విడత ఓట్ల పండుగ.. కీలక అభ్యర్థులు వీళ్లే