Site icon HashtagU Telugu

YS Sharmila Bus Yatra : ఫిబ్రవరిలో షర్మిల బస్సు యాత్ర

Sharmila Bus Yatra

Sharmila Bus Yatra

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల (YS Sharmila)..ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై విమర్శలు సందిస్తూనే..మరోపక్క వరుస యాత్రలకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన లో బిజీ బిజీ గా గడుపుతున్న షర్మిల..ఫిబ్రవరి లో బస్సు యాత్ర (YS Sharmila Bus Yatra )మొదలుపెట్టబోతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ఈ బస్సు యాత్ర చేపట్టనున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె ఈ యాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలఫై ఇంకాస్త దూకుడు పెంచనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటె నిన్న తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్లో పాల్గొన్న జగన్..APCC చీఫ్ గా షర్మిలను నియమించడంపై స్పందించారు. ‘రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది. ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తోంది. నేను కాంగ్రెస్ కు రాజీనామా చేశాక మా చిన్నాన్నను మాకు వ్యతిరేకంగా పనిచేయించింది. విభజించి పాలించడం వాళ్ల నైజం. వీరికి దేవుడే గుణపాఠం చెబుతారు’ అని జగన్ ఫైర్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలడానికి జగన్ కారణం. ఆయనే చేతులారా చేసుకున్నారు. దానికి సాక్ష్యం దేవుడు, విజయమ్మ, నా కుటుంబం. సీఎం జగన్ నిన్న పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి సదస్సులో మాట్లాడారు. సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడు. జగన్ కోసం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. సమైక్యాంద్ర కోసం యాత్ర చేశాను. స్వలాభం చూసుకోకుండా.. ఏది అడిగితే అది జగన్ కోసం చేశాను. ప్రజలకి మేలు చేస్తాడని నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించాను. కానీ అలా జరగలేదు. రాష్ట్రాన్ని బీజేపీకి బానిసగా మార్చారు. బీజేపీకి జగన్ బానిసగా మారి స్టీల్ ప్లాంట్ పణంగా పెట్టారు. రాజధాని ఉందా? లేదా? అని ప్రజలకి అర్ధం కావడం లేదు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మంది మంత్రులు అయ్యారు’ అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

‘నా కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాను. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని, విమర్శలు చేస్తారని తెలుసు. అన్ని ఆలోచించుకునే బరిలోకి దిగా. ఎమ్మెల్యేలకు కూడా సీఎం కనిపించరు. నియంతలా మారి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారు. ఎంత మంది కష్టపడి త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారు. పక్కన ఉన్న వారందరీనీ ఎందుకు దూరం చేసుకుంటున్నారు. వైఎస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది’ అని షర్మిల విమర్శించారు.

Read Also : EAMCET : ఎంసెట్ పేరు మార్చిన తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి