YS Sharmila : కడప లోక్‌సభ బరిలో షర్మిల.. అవినాశ్ రెడ్డితో ఢీ ?

YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Jagan Sharmila

Jagan Sharmila

YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది. ఆమె కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం కోరిక మేరకు ఆమె కడప లోక్‌సభ నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని సమాచారం. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్  అభ్యర్థుల ఫస్ట్ లిస్టును విడుదల చేయనుంది.అందులోనే షర్మిల పేరు ఉంటుదని అంచనా వేస్తున్నారు. రేపు(మంగళవారం) కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.

వైఎస్ అవినాశ్ రెడ్డితో ఢీ..

కడప నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాశ్ నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు అధిష్టానం సీటివ్వదని పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ జగన్ మాత్రం అటు తిరిగి.. ఇటు తిరిగి అవినాశ్‌కే టికెట్ ఇచ్చారు. ఆయనపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని హస్తం పార్టీ హైకమాండ్ నమ్మకంతో ఉందట. కడప లోక్‌సభ నుంచి షర్మిల(YS Sharmila)  పోటీచేస్తారన్న విషయం పక్కా అయితే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలోకి దిగినట్లు అవుతుంది. కడప నుంచి షర్మిల పోటీపై ఇంకా క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తూ ఎక్కువగా జాతీయ స్థాయి అంశాలనే షర్మిల లేవనెత్తారు. దీన్నిబట్టి ఆమె ఆసక్తి పార్లమెంటు వైపే ఉందని స్పష్టమైంది. ఇటీవల షర్మిల ప్రసంగిస్తూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు సిగ్గువిడిచి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి సర్కారు. ప్రధాని మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారే. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం’’ అంటూ జగన్ పై షర్మిల సెటైర్లు పేల్చారు.

Also Read : Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు

  Last Updated: 18 Mar 2024, 11:33 AM IST