AP Congress : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే.. నేడో.. రేపో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న ఏఐసీసీ..?

ఏపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప‌దేళ్లుగా స్తబ్థుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పుంజుకోబోతుంది. జ‌గ‌న్ వ‌దిలిన బాణంగా గ‌త

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 12:15 PM IST

ఏపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప‌దేళ్లుగా స్తబ్థుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పుంజుకోబోతుంది. జ‌గ‌న్ వ‌దిలిన బాణంగా గ‌త రెండు ప‌ర్యాయాలు వైసీపీ నుంచి ప్ర‌చారం చేసిన ష‌ర్మిల‌.. అదే వైసీపీకి ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి కాబోతుంది. క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో అధికారం సాధించిన త‌ర‌వాత ఏపీలో కూడా త‌న ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తుంది. ఇందుకోసం అన్ని మార్గాల‌ను కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తుంది. తెలంగాణ‌లో వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని పెట్టిన ష‌ర్మిల‌.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా కాంగ్రెస్‌కి మ‌ద్ద‌తు ఇచ్చింది. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల‌ని భావించిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మ‌రికొంత మంది ఆమె రాక‌ను వ్య‌తిరేకించారు. దీంతో చేసేదేమీ లేక పార్టీ హైక‌మాండ్ సూచ‌న‌ల‌తో కాంగ్రెస్‌కి మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు తాజాగా ఆమెను ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షురాలిని చేసి అక్క‌డ పార్టీని గాడిలో పెట్టాల‌ని హైక‌మాండ్ ఆలోచ‌న చేసింది. ష‌ర్మిల‌కి రాజ్య‌స‌భ ఇచ్చి.. ఏపీలో కాంగ్రెస్‌ని బ‌లోపేతం చేయాలని అధిష్టానం భావిస్తుంది. దీనికి తోడు త‌న అన్న జ‌గ‌న్‌పై కూడా చెల్లిల‌తో పోరాడిస్తే రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని ఏఐసీసీ పెద్ద‌లు భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ త‌న ఉనికిని చాటేందుకు అధిష్టానం సన్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు ఏపీసీసీ నేత‌ల‌తో ఖ‌ర్గే, రాహుల్ స‌మావేశమైయ్యారు. ఈ స‌మావేశంలో ష‌ర్మిల‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఆమె జగన్‍లా చేయరు.. అన్నీ తాము చూసుకుంటామని వారు వెల్లడించిన‌ట్లు స‌మాచారం.

Also Read:  Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన, సభలు, సమావేశాలతో బిజీ బిజీ!