ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఆలస్యం ఏపీలో వరుస పర్యటనలతో బిజీగా మారారు వైస్ షర్మిల (YS Sharmila). ఓ పక్క ఏపీలో టూర్స్ చేస్తూనే మరోపక్క ఢిల్లీ లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్నా సైతం చేసి నేషనల్ మీడియా లో సైతం హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మరింత జోరు పెంచారు షర్మిల. ఇప్పటికే రోజుకు మూడు జిల్లాల చొప్పున 9 రోజుల్లో సమీక్షలు పూర్తి చేసిన షర్మిల.. రెండో విడత టూర్ కు సిద్ధమయ్యారు. అనంతపురం (Anantapur Tour ) జిల్లాలో ఈరోజు స్ధానికంగా పలు కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్న షర్మిల ఆకస్మికంగా వీటిని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. సడెన్ గా వైరల్ ఫీవర్ (Viral Fever) రావడం తో.. షర్మిల.. అనంతపురం టూర్ ను రద్దు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా ప్లాన్ ప్రకారం.. మడకశిర బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. రేపు సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. సహాపంక్తి భోజనం, కూలీలతో ముఖాముఖి కూడా ప్లాన్ చేశారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, విభజన హామీలను జనంలోకి తీసుకెళ్లే విధంగా క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సి ఉంది. కానీ వైరల్ ఫీవర్ కారణంగా ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. మళ్లీ కొత్త షెడ్యూల్ ఎప్పటి నుండి మొదలుపెడతారో చూడాలి.
ఇదిలా ఉంటె వైఎస్ షర్మిలతో పాటు వివేకానందా రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని తీవ్రంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్(X)లో పోస్టు చేశారు. మహిళలను అవమానించడం… వారిపై ఇలాంటి దాడి చేయడం పిరికిపందే చర్యగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు ఇటీవలే కాలంలో ఇది కొందరికి ఒక ఆయుధంగా మారిపోయిందని దుయ్యబట్టారు. వైఎస్ షర్మిల, సునీతపై జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని , ఇద్దరికి పార్టీతో పాటు తన మద్దతుగా ఉంటుందని పోస్ట్ చేసారు.
Read Also : Modi Lok Sabha Speech : తమకు ఓట్లు కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యం – ప్రధాని మోడీ