ఏపీలో పది వారం రోజులుగా బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాల్ వ్యవహారం (Kadambari Jethwani Issue ) హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ (YCP) ప్రభుత్వ అధికారులు , నేతలు విధించిన ఘటన ఫై ప్రస్తుత ఏపీ సర్కార్ (AP Govt) సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టింది..వేధింపులకు పాల్పడిన అధికారులను , నేతలను ఎవ్వర్నీ వదిలిపెట్టింది లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఈ వ్యవహారం ఫై మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులోజగన్ అనుసరించిన వ్యవహార శైలిఫై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ నీకు ఇద్దరు బిడ్డలున్నారు కదా? జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని అని ప్రశ్నించింది. ‘ముంబై నటి కాదంబరి జైత్వాల్‌ను ఎలా కట్టడి చేయాలో సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గం. ఒక మహిళను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్ వేయడం దారుణం’ అని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
‘వైద్యురాలైన కాదంబరి జైత్వాల్‌ను మానసికంగా వేదనకు గురిచేశారు. సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. కేసు పెట్టాలని చూసిన ఆమెను తొక్కి పడేశారు. కాదంబరి జైత్వాల్ సామాన్యురాలైతే రూ.వంద కోట్లు ఇచ్చి నొక్కి పెట్టేసేవారు. కానీ ఉన్నతమైన కుటుంబం కావడంతో ఇక్కడకు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గం. నాటి సీఎం జగన్‌కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్ జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు’ అని షర్మిల నిలదీశారు.
అసలు ఏంజరిగిందంటే..వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidyasagar) కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లిన సమయంలో పరిచయమైన సినీ నటి కాదంబరి జెత్వానీ.. ఆ తర్వాత ఆయనకు దగ్గరైంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో విద్యాసాగర్ వైసీపీ అగ్రనేతల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను విద్యాసాగర్ వదిలించుకునేందుకు వైసీపీ పెద్దలు కొందరు ఐపీఎస్ ల సాయంతో ఆమెను ముంబైకి వెళ్లి అరెస్టు చేసి విజయవాడ తెచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీతో పాటు కాంతిరాణా టాటా పాత్రపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వీరిద్దరిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
రీసెంట్ గా విజయవాడ పోలీసులను కలిసి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కాదంబరి జెత్వానీ మీడియా తో మాట్లాడారు. నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు విజయవాడ వచ్చానని , దేశంలో మంచి వాళ్లు ఉన్నారని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. నేను, నా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని కాదంబరి తెలిపింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, అనేక రకాలుగా వేధించారని వివరించారు. వేధింపులకు సంబంధించి నా వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించానని వెల్లడించారు.
Read Also : PM Modi : బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం