Site icon HashtagU Telugu

YS Family : వైఎస్ కుటుంబంలో చిచ్చురేపుతున్న లేఖల పర్వం

Ys Family Letters

Ys Family Letters

ఏపీ లో రాజకీయాలు ఏమోకానీ..వైఎస్ కుటుంబంలో విభేదాలు మాత్రం రోజు రోజు కు పిక్ స్టేజ్ కి వెళ్తున్నాయి. వైఎస్ వివేకా ను హత్య చేసింది ముమ్మాటికీ అవినాష్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల , వివేకా కూతురు సునీత ఆరోపిస్తూ ఉండగా.. తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ (YS Vivekananda Reddy Wife Sowbhagyamma) జగన్ కు సూటి ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాసారు. ఈ లేఖలో 2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో, 2019 లో తన తండ్రి చనిపోతే నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని, మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం సరికాదని , హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం…ఇది సమంజసమా అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ సౌభాగ్యమ్మ లేఖ రాసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ లేఖకు కౌంటర్ గా ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డి అర్ధాంగి వైఎస్ లక్ష్మి (YS Lakshmi) మరో లేఖ రాసారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంత బాధపడ్డాడో ఇప్పుడు గుర్తొస్తోందా..? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను చిన్నచూపు చూసినప్పుడు పెద్ద దిక్కుగా నిలవాల్సిన మీరందరూ ఎక్కడున్నారు..? మీరందరూ మీ స్వార్థం మీరు చూసుకుని జగన్ ను ఒంటరివాడ్ని చేసిప్పుడు అతడి మనోవేదన గుర్తుకురాలేదా..? 2011లో విజయమ్మపై వివేకాను పోటీ చేయించినప్పుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా..? జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నది ఎంత వాస్తవమో, 2019 మార్చి 14వ తేదీ రాత్రి అవినాశ్ రెడ్డిని ఎంపీగా గెలిపించమంటూ వివేకా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంతే వాస్తవం అని వైఎస్ లక్ష్మి లేఖలో ప్రస్తావించారు. వైఎస్సార్, జగన్ ప్రత్యర్థులతో మీ కుమార్తె చేతులు కలిపి వారి చేతుల్లో పావుగా మారితే జగన్ మీకు ఏ విధంగా మద్దతు ఇస్తాడు..? ఏ మాత్రం సంబంధం లేని వాళ్లను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తుంటే జగన్ మీకు మద్దతు ఇవ్వాలా..? హత్యకు కారకులు మీతోనే ఉన్నారు… దొంగే దొంగను పట్టుకోమంటే దొంగ ఎప్పటికి దొరుకుతాడు..? కోర్టులో కేసు నడుస్తుంటే, హంతకుడు అంటూ మీరే మాట్లాడతారు. ఇప్పటికైనా నీ కుమార్తె సునీత, షర్మిల… జగన్ ప్రత్యర్థుల కుట్ర నుంచి బయటికి వచ్చి న్యాయపోరాటం చేయాలి. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల బాధపడుతన్న వారి వేదనను అర్థం చేసుకోండి… నిజం తప్పకుండా బయటికి వస్తుంది” అంటూ వైఎస్ లక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖ ఫై సౌభాగ్యమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Also : CM Jagan: క్రాస్ ఓటింగ్ పై సీఎం జగన్ అలర్ట్..