Site icon HashtagU Telugu

YS Jagan Tirumala Tour Cancelled: వైఎస్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు

YS Jagan Tirumala Tour Cancelled

YS Jagan Tirumala Tour Cancelled

YS Jagan Tirumala Tour Cancelled: వైఎస్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న (YS Jagan Tirumala Tour Cancelled) ర‌ద్దైంది. త‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను రద్దు చేసుకుంటూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న డిక్లరేష‌న్ ఇచ్చిన త‌ర్వాతే తిరుమ‌ల‌కు రావాల‌ని అధికార పార్టీ నేత‌లు, ప‌లువురు భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు సైతం అదే నిర్ణ‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు. దీంతో చివ‌రి క్ష‌ణంలో ఆయ‌న తిరుమ‌ల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీ నేత‌ల‌కు పోలీసులు ముంద‌స్తు నోటీసులు, తిరుప‌తి జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు, డిక్ల‌రేష‌న్ అంశాల‌పై ఆయ‌న మ‌రికాసేప‌ట్లో మీడియాతో మాట్లాడనున్న‌ట్లు స‌మాచారం.

Also Read: Kunki Elephants : ఏపీ-కర్ణాటక మధ్య కీలక ఒప్పందాలు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అయితే జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేక‌నే తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నాడ‌ని కూట‌మి పెద్ద‌లు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు అనేది ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే చాలా మంది భ‌క్తులు జ‌గ‌న్ తిరుమ‌ల‌కు వ‌స్తే డిక్ల‌రేష‌న్ ఇస్తారా..? ఇవ్వ‌రా అనే సందిగ్ధంలో ఉండ‌గానే త‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు బాంబు పేల్చారు జ‌గ‌న్‌.

చివ‌రి నిమిషంలో వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆఖరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటని ఇటు అధికార పార్టీ నేత‌లు.. అటు వైసీపీ శ్రేణులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డిక్లరేషన్‌పై సంతంకం చేయాలని టీటీడీ అధికారులు చెప్పడంతో జగన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే జగన్ తిరుమల పర్యటన ప్రకటించినప్పటి నుంచి టెన్షన్ వాతావరణం నెలకొనడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే తిరుమ‌ల‌లో అక్టోబ‌ర్ 24వ‌ర‌కు సెక్ష‌న్ 30 పోలీస్ యాక్ట్ అమ‌లు చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

Also Read: Sudarshan 35MM Theatre : ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు..ఫ్యాన్స్ ఆగ్రహం