YS Jagan : 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. 2019 ఎన్నికల్లో అద్భుత ఫలితాన్ని సాధించిన వైఎస్సార్ సీపీకి ఈ ఎన్నికల ఫలితం భారీ షాక్‌ను మిగిల్చింది. ఈ షాక్ నుంచి బయటపడే ప్రయత్నాల్లో వైఎస్ జగన్ ఉన్నారు. ఈక్రమంలోనే ఆయన బలమైన ఫ్యూచర్ ప్లాన్‌ను రెడీ చేయడంపై ఫోకస్ పెట్టారట. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒక ఎన్నికల వ్యూహకర్తతో ప్రస్తుతం జగన్ టచ్‌లో ఉన్నారట. 2019 ఎన్నికల సమయంలో జగన్ కోసం స్వయంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల పనుల నుంచి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నారు. నాటి నుంచి ఐప్యాక్‌లో కీలక పాత్రలన్నీ రిషి రాజ్‌సింగ్ పోషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున రిషి రాజ్ సింగ్ పనిచేశారు. అయితే రిషి రాజ్ సింగ్ ఇచ్చిన ‘‘వై నాట్ 175’’ ఐడియా వర్కౌట్ కాలేదు. వైసీపీ బోర్లా పడటంతో జగన్ ఖంగుతిన్నారు. అయినా రిషి రాజ్ సింగ్‌పై జగన్‌కు నమ్మకం పోలేదు. తాజాగా మరోసారి బెంగళూరు వేదికగా రిషి రాజ్ సింగ్‌తో జగన్ భేటీ అయ్యారట. భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపై ఇద్దరూ చాలాసేపు మేధోమధనం చేశారట.
Also Read :Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
ఐడియాల అమలు షురూ
రిషి రాజ్ సింగ్ ఇచ్చిన కొన్ని ఐడియాలను మళ్లీ క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా జగన్(YS Jagan) అడుగులు వేస్తున్నారట. ఇందులో భాగంగానే 2024 ఎన్నికల టైంలో చేసిన తప్పులను జగన్ సరిదిద్దుకుంటున్నారని సమాచారం. అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, టికెట్ల ఖరారు లో చేసిన ప్రయోగాలు వైఎస్సార్ సీపీని బాగా దెబ్బకొట్టాయి. ఆనాడు అడ్డదిడ్డంగా తీసుకున్న నిర్ణయాల వల్ల దూరమైన నేతలు, వర్గాలకు చేరువ అయ్యేందుకు జగన్ స్కెచ్ గీస్తున్నారు. ఏపీలోని కూటమి సర్కారు చాలా బలంగా ఉన్న అసెంబ్లీ స్థానాల పరిధిలో బలమైన నేతలను జిల్లాల అధ్యక్షులుగా నియమించడంపై జగన్ ఫోకస్ పెట్టారు.
Also Read :Megha Engineering: న్యూక్లియర్ పవర్ రంగంలోకి ‘మేఘా’.. రూ.12,800 కోట్ల కాంట్రాక్ట్
సామాజిక వర్గాలపై ఫోకస్
టీడీపీ, జనసేనలకు ఓటుబ్యాంకుగా ఉన్న కీలక సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ అధినేత భావిస్తున్నారట. ప్రధానంగా ఉభయ గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల మద్దతును కూడగట్టాలని జగన్ అనుకుంటున్నారట. ఆయా వర్గాలకు పార్టీ పదవులు, కీలక బాధ్యతలను ఇచ్చేందుకూ ఆయన సిద్ధంగా ఉన్నారట. మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి కోసం ఏమేం చేస్తాననే దానిపై జగన్ అడ్వాన్సుగా హామీలు ఇచ్చేస్తున్నారట. వచ్చే నెల(మే) నుంచి తాడేపల్లిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారు. జూన్ నుంచి ఆయన జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. 2019 తరహా సోషల్ ఇంజినీరింగ్ ఫార్ములాతో వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని ఆయన భావిస్తున్నారు.