Site icon HashtagU Telugu

YS Jagan To Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు జ‌గ‌న్ వార్నింగ్.. ఇప్ప‌టికైనా దాడుల‌కు ఫుల్‌స్టాప్ పెట్టు అంటూ సూచ‌న‌..!

Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

YS Jagan To Chandrababu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు సెంట్ర‌ల్ జైలుకు వెళ్లారు. అనంతరం జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించారు. ఈ క్రమంలో నెల్లూరు జైలు వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు తరలివచ్చారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యా నేరం మోపారని ఆరోపించారు. టీడీపీకి ఓట్లు వేయలేదని దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐకి ఏదో చిన్న రాయి తగిలితే దాన్ని రాద్దాంతం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

అంతేకాకుండా ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను చూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమ చేసి టీడీపీ నేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. మేము ప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఓడిపోయాం. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి. కానీ, దౌర్జన్యాలు చేయకూడదు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తెలిపారు.

Also Read: PM Modi Meets Team India: ప్ర‌ధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైర‌ల్‌..!

ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ (YS Jagan To Chandrababu) ఇచ్చారు. ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు. మీ పాపాలు పండుతున్నాయి. తప్పుడు రాజకీయాలు నువ్వొక్కడివే చేస్తున్నావు. ఇదే మాదిరి కొనసాగితే.. రేపు పొద్దున నువ్వు వేసే బీజం, చెట్టు అవుతుంది. భవిష్యత్‌లో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. రియాక్షన్ ఉంటుంది. ఇప్పటికైనా దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టు చంద్రబాబు అని హెచ్చరించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్.. చంద్ర‌బాబుకు ఇచ్చిన వార్నింగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మరీ జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై సీఎం చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

We’re now on WhatsApp : Click to Join