YS Jagan : జ‌గ‌న్ చెల‌గాటం..వ్య‌వ‌స్థ‌ల సంక‌టం!

`చంద్ర‌బాబు, లోకేష్ ను జైల్లో పెడ‌తాం...అవినీతి డ‌బ్బును క‌క్కిస్తాం..ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్‌ను నిరూపిస్తాం...ఏపీ బ్రాండ్ బ్యాండ్ కుంభ‌కోణం..బ‌య‌ట‌కు తీస్తాం..` ఇవీ.. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి అనేక వేదిక‌ల‌పై ప‌లికిన ప్ర‌గ‌ల్భాలు. వాళ్ల మాట‌లను న‌మ్మిన ఏపీ ప్ర‌జ‌లు `ఒక్క ఛాన్స్` ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Ys Jagan Lakshminarayaj

Ys Jagan Lakshminarayaj

`చంద్ర‌బాబు, లోకేష్ ను జైల్లో పెడ‌తాం…అవినీతి డ‌బ్బును క‌క్కిస్తాం..ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్‌ను నిరూపిస్తాం…ఏపీ బ్రాండ్ బ్యాండ్ కుంభ‌కోణం..బ‌య‌ట‌కు తీస్తాం..` ఇవీ.. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి అనేక వేదిక‌ల‌పై ప‌లికిన ప్ర‌గ‌ల్భాలు. వాళ్ల మాట‌లను న‌మ్మిన ఏపీ ప్ర‌జ‌లు `ఒక్క ఛాన్స్` ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏ ఒక్క ఆరోప‌ణ‌నూ జ‌గ‌న్ స‌ర్కార్ నిరూపించ‌లేక‌పోయింది. ఏదో ఒక కార‌ణం చూపి ప్ర‌తిప‌క్ష లీడ‌ర్ల‌ను అరెస్ట్ చేసి హ‌ల్‌చ‌ల్ చేయ‌డం వ‌ర‌కు ప‌రిమితం అయింది. తాజాగా స్కిల్ డెవ‌లెప్మెంట్ కుంభ‌కోణం అంటూ ఏపీ సీఐడీ పోలీసులు చేసిన హ‌డావుడి జ‌గ‌న్ స‌ర్కార్ వాల‌కాన్ని ప్ర‌శ్నిస్తోంది.మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు, న‌మ్మ‌క‌స్తులుగా గంటా సుబ్బారావు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయ‌ణ ఉన్నారు. వాళ్లిద్ద‌రికీ ప్ర‌భుత్వంలో ఆనాడు మంచి పేరుంది. ల‌క్ష‌ల మంది విద్యార్థుల నైపుణ్యం పెంచ‌డానికి గంటా సుబ్బారావు చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి. సాఫ్ట్ వేర్ రంగంలోకి తెలుగు విద్యార్థుల‌ను తీసుకెళ్ల‌డానికి చంద్ర‌బాబు హైటెక్ సిటీని నిర్మిస్తే, ఆ టైంలోనే విద్యార్థుల‌కు త‌గిన స్కిల్స్ ను నేర్ప‌డానికి గంటా సుబ్బారావు చిత్త‌శుద్ధితో ప‌నిచేశార‌ని ఆయ‌న స‌హ‌చ‌రులు చెబుతుంటారు.


ఇంజ‌నీరింగ్ అంటే ఏమిటో చాలా మందికి తెలియ‌ని 1981లో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యునికేష‌న్ విభాగంలో బీటెక్ చేసిన విద్యావంతుడు సుబ్బారావు. ఢిల్లీలోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ లో కంప్యూట‌ర్ సైన్స్ లో డీఐఐటీ చేసిన అనుభ‌వ‌జ్ఞుడు. 1985లోనే అమెరికాలోని మిన్న‌సోట యూనివ‌ర్సిటీ నుంచి ఎంఎస్ తో పాటు పీహెచ్ డీ చేశాడు. ఆ రోజు నుంచి ఎవెల్యూష‌న్ ఆఫ్ కంప్యూట‌ర్ సిస్ట‌మ్ లాంటి అనేక సాప్ట్‌ వేర్ రంగంలోని ప‌లు మాడ్యూల్స్ మీద రీసెర్చ్ చేసిన అపార అనుభ‌వం ఆయ‌నది. ప్ర‌పంచంలోని అనేక యూనివ‌ర్సిటీల్లో ఎంఎస్, పీహెచ్ డీ స్టూడెంట్స్ కోసం లెక్చ‌ర్స్ ఇచ్చాడు. అమెరికాలోని ప‌లు యూనివ‌ర్సిటీల్లో ఫ్యాక‌ల్టీగా ప‌నిచేశాడు. సాప్ట్ వేర్ రంగంలోని ఆయ‌న అనుభ‌వాన్ని చంద్ర‌బాబు మూడు ద‌శాబ్దాల క్రితం గుర్తించాడు.సీఎంగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు(1999-2004) ఆయ‌న ప్రోత్సాహంతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ స్థాపించాడు. ఆ త‌రువాత విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించ‌డానికి అవ‌స‌ర‌మైన స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కోసం ఇంజ‌నీరింగ్ కాలేజిల్లో జ‌వ‌హ‌ర్ నాలెడ్జి కేంద్రాల‌ను నెల‌కొల్పాడు. ఏపీ స్కిల్ డ‌వెల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ను రూప‌క‌ల్ప‌న చేసి, విద్యార్థుల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా, ఉన్న‌త ఉద్యోగస్తులుగా తీర్చిద్దారు. ప‌రిపాల‌న‌లోనూ(ఈ గ‌వ‌ర్నెన్స‌)సాంకేతిక‌త‌ను జోడించ‌డానికి స‌హాయ స‌హ‌కారాల‌ను అందించాడు. మెషీన్ లెర్నింగ్ నుంచి ఆర్డిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ వ‌ర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతోన్న ప్ర‌పంచానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచాల‌ని త‌హ‌త‌హ‌లాడే మ‌న‌స్త‌త్వం సుబ్బారావుకు ఉండేద‌ని ఆయ‌న స‌హ‌చ‌రులు ఎవ‌రైనా చెబుతారు.

విభ‌జిత ఏపీ స్కిల్ డెల‌ప్మెంట్‌, ఎంట‌ర్ ప్రెనూర్ షిప్ విభాగానికి తొలి కార్య‌ద‌ర్శిగా, ఏపీ స్కిల్ డ‌వ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఎండీ, సీఈవోగా చంద్ర‌బాబు హ‌యాంలో ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో 240 కోట్ల కుంభకోణానికి పాల్ప‌డ్డాడ‌ని ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ ఆరోపిస్తోంది. అందుకు సీనియ‌ర్ ఐఏఎస్ లక్ష్మీనారాయ‌ణ స‌హ‌క‌రించాడ‌ని అరెస్ట్ చేసింది.జ‌గ‌న్ స‌ర్కార్ టీడీపీ నేత‌ల‌ను, చంద్ర‌బాబు స‌న్నిహితుల‌ను అరెస్ట్ చేయ‌డం ఈ రెండున్న‌రేళ్ల‌లో ఇది కొత్తేమీద కాదు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను జైల్లో పెట్టింది. హ‌త్యారోప‌ణ‌ల‌తో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను, ఈఎస్ఐ స్కాం అంటూ మాజీ మంత్రి అచ్చెంనాయుడును జైలుకు పంపింది. మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల న‌రేంద్ర ను సంగం డైయిరీ అంశంపై జైల్లో పెట్టారు.
ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అంటూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ విచారించింది. మాజీ మంత్రులు గంటా, అయ్య‌న్న‌పాత్రుడులపై కేసులు పెట్టింది. ఇలా..అనేక మందిపై ఆరోప‌ణ‌ల‌ను ఆపాదిస్తూ సీఐడీ, పోలీస్ ల‌తో విచార‌ణ‌ల‌ను చేప‌ట్టిది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పైసా రిక‌వ‌రీ చేయ‌డంగానీ, అవినీతిని నిరూపించ‌డంగానీ జ‌ర‌గ‌లేదు. ఫ‌లితంగా జ‌గ‌న్ స‌ర్కార్‌ క‌క్ష సాధింపుకు పాల్ప‌డుతోంద‌ని భావించ‌డం స‌హ‌జం. తాజాగా గంటా సుబ్బారావు, ల‌క్ష్మీనారాయ‌ణల‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయ‌డం ద్వారా మాజీ నిఘాధిప‌తి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఎపిసోడ్ గుర్తుకు వ‌స్తోంది. ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మకం స‌న్నగిల్లుతోంద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ గ‌మ‌నించాలి.

  Last Updated: 11 Dec 2021, 01:59 PM IST