Site icon HashtagU Telugu

YS Jagan : పార్లే సంస్థ‌తో జ‌గ‌న్ స‌ర్కార్ `ఎంవోయూ`

Vizag Capital

Vizag Jagan

ఏపీలోని బీచ్ ల ప‌రిర‌క్ష‌ణ కోసం పార్లే సంస్థ‌తో జ‌గ‌న్ స‌ర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేర‌కు జ‌గ‌న్ , పార్లే ప్ర‌తినిధులు విశాఖ కేంద్రంగా ప‌త్రాలపై సంత‌కాలు చేశారు. ఉద‌యం విశాఖపట్నం వెళ్లిన సీఎం జ‌గ‌న్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులతో బీచ్ పరిరక్షణపై ఎంఓయూ కుదుర్చుకున్నారు.

సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు సీఎం చేరుకుని మైక్రోసాఫ్ట్ అందించిన డిప్లొమా కోర్సు పూర్తి చేసిన 5 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అంద‌చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ త‌రువాత ఆయ‌న తాడేప‌ల్లికి చేరుకుంటారు. గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు పార్లే ఫర్ ఓషన్ సంస్థ శుక్రవారం బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేప‌ట్టింది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వర‌కు బీచ్‌ను శుభ్రం చేశారు. ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకు దాదాపు 28 కిలోమీటర్ల మేర బీచ్‌ వెంబడి ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను సేకరించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మొత్తం 20,000 మంది వాలంటీర్లు పాల్గొంటారు.