Sangam Barrage : `సంగం బ్యారేజి`పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

సంగం బ్యారేజి ప‌నుల‌ను ఈ ఏడాది మే 15 నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి చేయాల‌ని సీఎం స‌గ‌న్ ఆదేశించించారు

Published By: HashtagU Telugu Desk
Jagan Sangam

Jagan Sangam

సంగం బ్యారేజి ప‌నుల‌ను ఈ ఏడాది మే 15 నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి చేయాల‌ని సీఎం స‌గ‌న్ ఆదేశించించారు. స్వ‌ర్గీయ మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి స్మార‌క‌ చిహ్నంగా ఉండాలని ఉండాల‌ని ఆకాంక్షించారు. ఆ బ్యారేజికి గౌత‌మ్ రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేశామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం కనుపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన సంతాప సభలో ఆయన పాల్గొని మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-2 పనులను ఫేజ్-1గా మార్పు చేయ‌డం ద్వారా వేగ‌వంతం చేస్తామ‌ని ప్ర‌కటించారు. గౌతమ్ అభ్యర్థనను గౌరవిస్తూ ఉదయగిరిలోని క‌ళాశాలను అగ్రికల్చర్/హార్టికల్చర్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కె శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి అనిల్‌కుమార్‌ యాదవ్‌, గౌతమ్‌ తండ్రి రాజమోహన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ సభ్యుడు వీ ప్రభాకర్‌రెడ్డి, శాసనసభ్యులు, కలెక్టర్‌ చక్రధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 28 Mar 2022, 02:38 PM IST