Site icon HashtagU Telugu

Jagan Cadre Meet: చంద్ర‌బాబు ఇలాఖాపై జ‌గ‌న్ ఆప‌రేష‌న్‌

Jagan mohan reddy

Jagan mohan reddy

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు నియోజ‌క‌వ‌ర్గం కుప్పం నుంచి సీఎం జ‌గ‌న్ స‌రికొత్త రాజ‌కీయ ఆప‌రేష‌న్ కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. క్షేత్ర‌స్థాయిలోకి కార్య‌క‌ర్త‌ల‌తో నేరుగా భేటీ అయ్యే కార్య‌క్ర‌మానికి గురువారం ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ మేర‌కు తొలుత కుప్పం నుంచి క్యాడ‌ర్ తో ముఖాముఖికి జ‌గ‌న్ సిద్ధం అయ్యారు. ఆ మేర‌కు ఏర్పాట్ల‌ను వైసీపీ చేస్తోంది.

పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. క్యాడ‌ర్ కు ఆయ‌న ఇచ్చిన హామీ మేరకు గురువారం (ఆగస్టు 4) నుంచి నేరుగా కార్యకర్తలతో భేటీ కానున్నారు. ముందుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు.
భేటీ త‌రువాత మధ్యాహ్నం సభ జరగనుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, అభివృద్ధి, పటిష్టత, అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చిస్తారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.