Site icon HashtagU Telugu

Kurnool : లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Jagan Law

Jagan Law

కర్నూలు (Kurnool)లో పర్యటించిన సీఎం జగన్ (CM Jagan) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ (University of Law)కి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించారని, కానీ అది సాధ్యం కాలేదని అన్నారు. తాము హైకోర్టును కర్నూలులో పెడతామని ఇదివరకే చెప్పామని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందుకే ఇక్కడ లా యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. లా యూనివర్సిటీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. న్యాయపరమైన అంశాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లా యూనివర్సిటీతో పాటు పలు అనుబంధ విభాగాలు కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని, వీటివల్ల కర్నూలు ప్రాంతానికి మేలు జరుగుతుందని అన్నారు.

Read Also : Titanic II Project: టైటానిక్-2 షిప్ వ‌చ్చేస్తుంది.. వ‌చ్చే ఏడాది నుంచే నిర్మాణ ప‌నులు..!