YSRCP Candidates : వ‌చ్చే ఎన్నిక‌ల్లో `నో ఛాన్స్` ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే?

ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయించుకుంటోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సుమారు 60 మంది ఎమ్మెల్యేల‌ను మార్చాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, 11 మంది ఎంపీల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులుగా తొల‌గించాల‌ని స‌ర్వేల సారాంశ‌మ‌ట‌.

  • Written By:
  • Publish Date - August 22, 2022 / 06:00 PM IST

ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయించుకుంటోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సుమారు 60 మంది ఎమ్మెల్యేల‌ను మార్చాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, 11 మంది ఎంపీల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులుగా తొల‌గించాల‌ని స‌ర్వేల సారాంశ‌మ‌ట‌. ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్న జ‌గ‌న్ ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చార‌ని తాడేప‌ల్లిలోని టాక్‌. సిట్టింగ్‌ల స్థానాల‌ను భారీగా మార్పు చేయాల‌ని అనుకుంటున్న వాళ్ల జాబితాలో ప‌లువురు మంత్రులు, ఎంపీలు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయాలంటే గెలుపు గుర్రాలు మాత్ర‌మే ఉండాల‌ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఖ‌రాఖండిగా చెప్పేశారట‌. విజ‌యం సాధించ‌డానికి అవ‌కాశాలున్న వ్య‌క్తుల‌నే ఎమ్మెల్యేలుగా ఎంపిక చేస్తాన‌ని, ప‌నితీరు బాగోలేని ఎమ్మెల్యేలు త‌మ గ్రాఫ్ ను మెరుగుప‌రుచుకోవ‌డానికి ఆరునెల‌ల స‌మ‌యం కూడా ఇచ్చారు. తాజాగా తాడికొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించ‌డంద్వారా రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌నితీరు బాగోలేని ఎమ్మెల్యేలంద‌రికీ సంకేతాలు పంపించారు.

హిందూపురం నుంచి ఉషాశ్రీచరణ్?
డొక్కాను నియ‌మిచండంద్వారా రాబోయే ఎన్నిక‌ల్లో శ్రీ‌దేవికి టికెట్ లేద‌ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చెప్ప‌క‌నే చెప్పేశారు. డొక్కాకు ఎలాగైతే బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారో అదే త‌ర‌హాలో మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఇత‌రుల‌కు బాధ్య‌త‌ల అప్ప‌గించేందుకు జ‌గ‌న్ సిద్ద‌ప‌డుతున్నారు. వీడియో కార‌ణంగా ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స్థానంలో క‌ల్యాణ‌దుర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌ను రంగంలోకి దింపుతార‌ని తెలుస్తోంది. ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు ప‌త్తికొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కేటాయిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉషాశ్రీ చ‌ర‌ణ్ ను హిందూపురం పంపించి క‌ల్యాణ దుర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత ర‌ఘువీరారెడ్డి కుమార్తె అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి పంపించి, అక్క‌డి నుంచి మంత్రిగా ఉన్న అంబ‌టి రాంబాబును అవ‌నిగ‌డ్డ‌కు పంపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సమాచారం. అవనిగడ్డ నుంచి అంబటి రాంబాబు, సినీ నటుడు సుమన్‌ను రేపల్లె నియోజక వర్గం నుంచి పోటీకి నిలిపేలా ప‌రిశీల‌న జ‌రుగుతోంద‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్యేగా పోటీచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న త‌రుణంలో ఆయ‌న్ను వేమూరు నుంచి బ‌రిలోకి దింపి మంత్రి మేరుగ‌ నాగార్జునను బాపట్ల పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. మెజారిటీ స్థానాల్లో పోటీచేసే అభ్య‌ర్థుల జాబితాను డిసెంబ‌రుక‌ల్లా పూర్తిచేయాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌. క‌నీసం 60 నుంచి 70 స్థానాల‌కు కొత్త అభ్య‌ర్థుల‌ను నిల‌పాల‌ని జ‌గ‌న్. అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికలకు కొత్త అభ్యర్థులను ప్రవేశపెట్టాలని ysrcp యోచిస్తోంది.

58 నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ల‌కు నో ఛాన్స్?
ఆ జాబితాలో ఉన్న 58 నియోజ‌వ‌ర్గాలు ఇలా ఉన్నాయి. (1.కుప్పం,(2)ఎచ్చెర్ల‌ (3).పాత‌ప‌ట్నం (4)టెక్కలి (5)ఇచ్ఛాపురం (6).ఎస్.కోట (7).బొబ్బిలి (8).గజపతినగరం (9) వైజాగ్ తూర్పు (10).విజాగ్ దక్షిణం (11) పాయకరావుపేట (12).నర్సీపట్నం (13).అరకువల్కే (14).గాజువాక (15) )పాడేరు (16).జగ్గంపేట (17)పిటాపురం(18) పత్తిపాడు (19).రాజమండ్రి అర్బన్,(20).రాజమండ్రి రూరల్ (21).కాకినాడ రూరల్ (22). రంపచోడవరం (23).పాలకొల్లు (24).ఉంగుటూరు (25).చింతలపూడి (26).ఏలూరు (27).విజయవాడ పశ్చిమం (28).కైకలూరు (29).పెనమలూరు (30).మైలవరం (31) అవనిగెడ్డ (32). సత్తెనపల్లి (33).మంగళగిరి (34).తాడికొండ (35) తెనాలి (36). బాపట్ల పొన్నూరు (37).వేమూరు (38).కావలి (39).కోవూరు (40).ఉదయగిరి (41).వెంకటగిరి (42).గూడూరు (43).కందుకూరు (44).మార్కాపురం (45). కొండెపి (46). సంతనూతలపాడు (47). యర్రగొండపాలెం (48).పూతలఓట్టు (49).శ్రీకాళహస్త్రి (49).పలమనేరు సింగనమల (50) హిందూపురం (51).పుట్టపర్తి (52) అనంతపురం (53). కళ్యాణదుర్గం(54) కర్నూలు(55) పత్తికొండ (56) నందికొట్కూరు(57) మైదుకూరు(58).పర్చూరు

సిట్టింగ్ ఎంపీలు 11 మందికి టిక్కెట్ లేన‌ట్టే?
ప్ర‌స్తుతం ఎంపీలుగా కొన‌సాగుతోన్న 11 సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఆ 11 మంది ఎంపీ స్థానాలు ఇలా ఉన్నాయి.
(1).విజ‌య‌నగరం (2). విశాఖపట్నం (3).అనకాపల్లి (4).అమలాపురం (5).బాపట్ల (6).విజయవాడ (7).శ్రీకాకుళం (8).నెల్లూరు (9)అనంతపురం (10).నర్సాపురం (11).ఏలూరు. వీళ్లంద‌రి పనితీరు, వ్యతిరేకత సర్వే బృందాలచే సేకరించబడుతుంది. గ్రాఫ్ ఆరు నెల‌ల్లో పెంచుకుంటే మిన‌హా టిక్కెట్ల ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. చివ‌రి నిమిషంలో ఏమ‌వుతుందో చూడాలి.