YS Jagan : సీనియ‌ర్ ఐఏఎస్ ల‌కు జ‌గ‌న్ జ‌ల‌క్‌, సీఎస్ గా `రెడ్డి`కి జై!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న వాళ్ల‌కు మేలు చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌రు.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 05:43 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న వాళ్ల‌కు మేలు చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌రు. స‌ల‌హాదారుల నుంచి పీఆర్వోల జాబితా వ‌ర‌కు ఎక్కువ మంది ఆయ‌న సామాజిక‌వ‌ర్గం వాళ్లే ఉంటారు. తాజాగా సీనియార్టీని కూడా ప‌క్క‌న‌ప‌డేసి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్ రెడ్డిని నియ‌మించారు. ప్ర‌భుత్వానికి ఉండే వెసుల‌బాటును ఆస‌ర‌గా చేసుకుని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత సామాజిక‌వ‌ర్గం ఐఏఎస్ కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని అప్ప‌గించార‌ని విప‌క్షాల నుంచి వినిపిస్తోన్న ఆరోప‌ణ‌లు. వ‌చ్చే ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకుని ముందుస్తుగా సీఎం జాగ్ర‌త్త‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శ‌లు కూడా లేక‌పోలేదు.

రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియ‌మిస్తూ ఉత్తర్వులు రావ‌డంపై సీనియ‌ర్ ఐఏఎస్ లు ఆశ్చ‌ర్యపోతున్నారు. ఆయ‌న‌1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. కానీ, ఆయ‌న కంటే సీనియ‌ర్లుగా సీనియర్ IAS అధికారి గిరిధర్ అరమనె ఉన్నారు. ఆయ‌న‌ 1988-బ్యాచ్ కి చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ క్యాడ‌ర్ IAS అధికారి. ప్రస్తుతం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవ‌ల విజయవాడలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కూడా క‌లిశారు. గతంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభ‌వం గిరిధ‌ర్ కు ఉంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్థిక శాఖ కార్యదర్శి, చిత్తూరు, ఖ‌మ్మం జిల్లాల‌ కలెక్టర్‌గా ప‌నిచేసిన ట్రాక్ రికార్డ్ రిచ్ గా ఉంది.

కేవ‌లం డాక్టర్ గిరిధర్ అరిమనే కాకుండా జ‌వ‌హ‌ర్ రెడ్డి కంటే సీనియ‌ర్ ఐఏఎస్ లు ​​నీరభ్ కుమార్ ప్రసాద్, పూనమ్ , కరికల్ వలవెన్ ఉన్నారు. వీళ్లంద‌ర్నీ కాద‌ని దాదాపు న‌లుగురి కంటే జూనియ‌ర్ గా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డిని ప్ర‌భుత్వ చీఫ్‌ఖ సెక్ర‌ట‌రీగా త‌న సామాజిక‌వ‌ర్గం ఐఏఎస్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నుకోవ‌డంపై విప‌క్షాలు నుంచి విమ‌ర్శ‌లను ఎదుర్కొంటున్నారు.

గిరిధర్ ఇటీవల యూనియన్ డిఫెన్స్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇత‌ర సీనియ‌ర్ ఐఏఎస్ ల‌ను సీఎంకు ఉండే విచ‌క్ష‌ణాధికారాల కార‌ణంగా ప‌క్క‌కు నెట్టారు. కొత్త సీఎస్ గా జ‌వ‌హ‌ర్ రెడ్డికి అవ‌కాశం ఇస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం సీఎస్ గా ఉన్న స‌మీర్ శ‌ర్మ న‌వంబ‌ర్ 30వ తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆయ‌న స్థానంలో డిసెంబర్ 1న జ‌హ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని ప్రభుత్వ వ‌ర్గాల స‌మాచారం. జవహర్ రెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత జూన్, 2024లో పదవీ విరమణ చేయనున్నారు.