AP Dirty Politics: నాడు పృథ్వి.. నేడు గోరంట్ల‌, మ‌రి వాళ్లిద్ద‌రు?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియో వ్య‌వ‌హారంపై నిఘా వ‌ర్గాలు సీఎం జ‌గ‌న్ కు నివేదిక అందించిన‌ట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - August 5, 2022 / 02:38 PM IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియో వ్య‌వ‌హారంపై నిఘా వ‌ర్గాలు సీఎం జ‌గ‌న్ కు నివేదిక అందించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి? ఒక వేళ స‌స్సెండ్ చేస్తే వ‌చ్చే ప‌రిణామాలు ఏమిటి? గ‌తంలో బ‌య‌ట‌కొచ్చిన వీడియోల మాటేమిటి? అనే అంశం మీద పార్టీ అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక మ‌హిళ‌తో మాట్లాడిన ఆడియో బ‌య‌ట‌కొచ్చిన విష‌యం విదిత‌మే. అర‌గంట అంటూ ఆ లేడీతో మాట్లాడుతూ ర‌సిక సామ్రాజ్యాన్ని ర‌చించారు. ఆ రోజున ఆ వీడియోపై ఆయ‌న స్పందించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేసిన కుట్ర అంటూ వ్యాఖ్యానించారు. మార్ఫింగ్ అంటూ రాజ‌కీయం చేశారు. కానీ, సీన్ క‌ట్ చేస్తే, రెండో విడ‌త మంత్రివ‌ర్గంలో ఆయ‌న‌కు చోటులేకుండా పోయింది. మంత్రి అంబ‌టి రాంబాబుకు సంబంధించిన ఆడియోలు ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆయ‌న ఒక లేడీతో ఒక గంటఅన్నీ చేస్తావా? అంటూ అశ్లీల మాట‌ల‌ను రంగ‌రిస్తూ ఉండే ఆడియో అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. ఆ ఆడియో మార్ఫింగ్ అంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. సీన్ కట్ చేస్తే, రెండో విడ‌త మంత్రివ‌ర్గంలో రాంబాబుకు ప‌దోన్న‌తి క‌లిగింది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత వైసీపీకి చెందిన పృద్విరాజ్ అశ్లీల మాట‌ ఆడియో తొలుత బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌ట్లో ఆయ‌న ఎస్వీబీసీ ఛాన‌ల్ చైర్మ‌న్ గా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఒక లేడీ యాంక‌ర్ తో ఫోన్లో మాట్లాడిన ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఆడియో మార్ఫింగ్ అంటూ తొలుత మేక‌పోతుగాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌రువాత నిఘా వ‌ర్గాల నివేదిక స‌మాచారం ఆధారంగా ఆయ‌న‌పై వైసీపీ చ‌ర్య‌లు తీసుకుంది. ప‌ద‌వికి రాజీనామా చేసి 30ఇయ‌ర్స్ ఇండిస్ట్రీ ఇంటిమొఖం ప‌ట్టారు. ఇప్పుడు జ‌న‌సేన పార్టీలో కీల‌కంగా మార‌బోతున్నారు. ఇప్పుడు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అనేది ఆస‌క్తిక‌రంగా ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మాధ‌వ్ మీద చ‌ర్య‌లు తీసుకోక‌పోతే, పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని పార్టీలోని వాళ్లు భావిస్తున్నారు. ఆ వీడియో మార్ఫింగ్ అని మాధ‌వ్ చెబుతున్న‌ప్ప‌టికీ నిజం లేద‌ని ప్రాథ‌మికంగా అర్థం అవుతోంది.

ఒక వేళ నిజ‌మ‌ని తేలితే చ‌ర్య‌లు తీసుకోవడానికి సిద్ధ‌మ‌నే సంకేతాలు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే, ఎంపీ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేస్తారా? అనే సందేహం కూడా వైసీపీ వ‌ర్గాల్లో ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉప ఎన్నిక‌ల వ‌స్తే, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఒక వేళ మాధ‌వ్ మీద జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటే, మంత్రి అంబ‌టి రాంబాబు మాట ఏంటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. బీసీ నాయ‌కుడు కాబ‌ట్టి మాధ‌వ్ మీద చ‌ర్య‌లు తీసుకున్నారు అనే అప‌వాదును వైసీపీ మోయాల్సి వ‌స్తుంది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యం కీల‌కం కానుంది.