Site icon HashtagU Telugu

Jagan EVM Tweet : అప్పుడు ముద్దు..ఇప్పుడు వద్దు..ఏందన్న జగనన్న

Jagan Evm Tweet

Jagan Evm Tweet

ఈవీఎం(EVM)లఫై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం జగన్ (Jagan) అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చ కు దారితీసింది. రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలు గెలిచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఓటమికి కారణం ఈవీఎం లే అనే అనుమానాన్ని తాజాగా జగన్ వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక (X) లో పోస్ట్ చేసారు.

“న్యాయం అందడమే కాదు.. అందజేసినట్లు కూడా కనిపించాలి, ప్రజాస్వామ్యం కూడా నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి.. పేపర్ బ్యాలెట్​ ఓటు పారదర్శకతను పెంచుతుందని, ప్రజల్లో విశ్వాసం నింపుతుంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో బ్యాలెట్​ పేపర్​ వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్‌ వాడకం ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటుతుంది, పౌరుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది” అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ చేసిన ఈ ట్వీట్ ఫై అధికార పార్టీ నేతలతో పాటు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదే జగన్ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని బయటకు తీశారు. “80 శాతం ఓటర్లు పోలింగ్ బూత్​లో బటన్ నొక్కారు. వాళ్లు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్​లో కూడా కనిపించింది. రెండూ మ్యాచ్​ అయ్యాయి కాబట్టే ఓటు వేసిన వాళ్లంతా సాటిస్​ఫై అయ్యారు. 80శాతం ఓటర్లలో ఏ ఒక్క ఓటరూ కంప్లయింట్​ ఇవ్వలేదు. నేను ఫ్యాన్​ గుర్తుకు ఓటేసి వీవీ ప్యాట్​లో సైకిల్​ గుర్తు కనిపిస్తే నేనెందుకు గమ్మనుంటా? గమ్మనుండను కదా! అక్కడే బూత్​లోనే గొడవ చేసి ఉండేవాడిని. కంప్లయింట్​ ఇచ్చే వాడిని. ఏ పార్టీ వాడైనా ఓటేసిన తర్వాత వేరే పార్టీకి పడుతున్నట్లుగా ఎవరికీ కనిపించలేదు కాబట్టే 80శాతం మంది జనాభా ప్రతి ఒక్కరూ సాటిస్​ఫై అయ్యారు. ఎటువంటివి ఎక్కడా జరగలేదు.” అని ఆరోజు స్వయంగా జగన్ చెప్పుకొచ్చారు.

మరి అప్పుడు ఆలా..ఇప్పుడు ఇలా ఏంటి జగనన్న అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉపఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదాం అని బుద్ధా పేర్కొన్నారు.

Read Also : Siddharth Mallya: ఈవారంలోనే మాల్యా కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?