YS Jagan Request: ఏపీకి వ‌చ్చే ముందు టీడీపీ ప్ర‌భుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన జ‌గ‌న్‌..!

  • Written By:
  • Updated On - July 2, 2024 / 10:00 AM IST

YS Jagan Request: ఏపీలో టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. సీఎంగా చంద్ర‌బాబు.. డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ నుంచి మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. నిన్న (జూలై 1) ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కేవ‌లం ఒక్క‌రోజులోనే 95శాతం ఫించ‌న్లు పంపిణీ చేసి ఔరా అనిపించింది. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ కూట‌మి ప్ర‌భుత్వానికి ఒక రిక్వెస్ట్ (YS Jagan Request) చేశారు. ఇది వ‌ర‌కు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు స్పందించిన ఈసారి అందుకు విరుద్ధంగా ల‌డ‌ఖ్‌లో వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ల కోసం ఏపీ స‌ర్కార్‌కు జ‌గ‌న్ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ ఎలా తీసుకుంటుందో చూడాలి.

జ‌గ‌న్ ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. లడఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన సుభాన్‌ ఖాన్ ఉండటం మరింత బాధాకరం. చనిపోయిన జవాన్లకి నా నివాళులు.. అలానే వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని త‌న ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

Also Read: Fake Job Notification: రైల్వే జాబ్స్ పేరుతో కుచ్చుటోపీ.. ఏపీలో ఎంతోమంది బాధితులు

తాడేప‌ల్లికి మాజీ సీఎం జ‌గ‌న్‌

ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ జ‌గ‌న్ ప‌ది రోజుల క్రితం పులివెందుల వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ పార్టీ నేత‌లు, ముఖ్య నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించి పార్టీ బ‌లోపేతానికి కావాల్సిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఆ త‌ర్వాత బెంగ‌ళూరులోని త‌న ప్యాలెస్‌కు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. ఇక ఈరోజు జ‌గ‌న్ దాదాపు ప‌ది రోజుల త‌ర్వాత తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి వ‌స్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join