YS Jagan Reacted: కార్యాలయం కూల్చివేతపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. తలొగ్గేది లేదు, వెన్నుచూపేది లేదు!

YS Jagan Reacted: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ (YS Jagan Reacted) తన ఎక్స్‌ ఖాతా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా […]

Published By: HashtagU Telugu Desk
YS Jagan Request

YS Jagan Request

YS Jagan Reacted: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ (YS Jagan Reacted) తన ఎక్స్‌ ఖాతా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు.

Also Read: Orange Peel: నిమ్మ, నారింజ తొక్కలను బయటపడేస్తున్నారా..? ఇకపై ఇలా చేయండి!

అయితే ఈరోజు ఉదయం 5.30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, పొక్లెయినర్లతో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించగా నిర్మాణం అక్రమమంటూ గతంలో CRDA అభ్యంతరం వ్యక్తం చేయగా YCP హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కూల్చివేత పనులు చేపట్టినట్లు తెలుస్తోంది.

తాడేపల్లి బోటు యార్డులో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అక్రమ కట్టడమని పేర్కొంటూ అధికారులు కూల్చివేశారు. ఇరిగేషన్ భూమిలో ఒక ఎకరా స్థలాన్ని 33 ఏళ్లకు గాను లీజు పేరుతో జీవో తీసుకుని వైసీపీ కార్యాలయాన్ని రాంకీ గ్రూపు నిర్మిస్తోంది. ఈ నిర్మాణం అక్రమమని, తక్షణమే ఆపివేయాలని సీఆర్‌డీఏ అధికారులు ఇదివరకే నోటీసులిచ్చారు. అయినా.. ఆపకపోవడంతో కూల్చివేశారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 22 Jun 2024, 10:30 AM IST