AP : బీటెక్ స్టూడెంట్ మాటలకు పులకరించిపోయిన సీఎం జగన్

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 02:06 PM IST

శుక్రవారం విద్యా దీవెన (Jagananna Vidya Deevena) నిధులను సీఎం జగన్ (CM Jagan) విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు (Pamarru ) సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు.

ఈ సభలో సీఎం జగన్ ఫై బీటెక్ స్టూడెంట్ (B.Tech Student) ప్రశంసలు కురిపించింది. సాయిప్రియ (Saipriya) అనే బీటెక్ విద్యార్థిని మాటలకు జగన్ పులకరించిపోయారు. జగన్ భావితరాలకు భవిష్యత్ అని ..అమ్మలా గోరుముద్దలు పెడుతూ, నాన్నలా ఫీజులు కడుతున్నారు. మీ వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీటెక్ చదువుతున్నా. అమ్మ ఖాతాలో ఎవరి ప్రమేయం లేకుండా డబ్బులు పడుతున్నాయి. ఇది కలియుగమేనా అని అనుమానం వస్తోంది. వాలంటీర్లు నాకు కావాల్సిన సర్టిఫికెట్లు మా ఇంటికే వచ్చి ఇస్తున్నారు. మీరే మళ్లీమళ్లీ CM కావాలి’ అంటూ ఆ అమ్మాయి పొగడ్తల్లో నింపేసింది. సాయిప్రియ మాటలకు వేదికపై ఉన్న వారే కాదు సభకు వచ్చిన వారంతా ఎంతో సంతోష పడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సభలో జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కంటే 2లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాదీవెన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్య కోసం అప్పులు చేసే పరిస్థితి తల్లిదండ్రులకు రాకూడదు. తల్లుల ఖాతాల్లోనే ఫీజు నగదు జమ చేస్తున్నాం. ఇప్పటి వరకూ రూ.12,609 కోట్లు ఈ పథకానికి ఖర్చు పెట్టాం. విద్యారంగానికి రూ.73 వేల కోట్లు అందించాం. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం’ అని సభలో చెప్పుకొచ్చారు.

విద్యా రంగంపైనా విపక్షాలతో క్లాస్ వార్ జరుగుతోందని జగన్ పేర్కొన్నారు. ఈ పెత్తందారుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే మాత్రం చెప్పరు. పిల్లలకు ట్యాబులిస్తే ఏవేవో చూస్తున్నారంటూ నానా యాగీ చేస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చినా పెత్తందారులు గోల చేస్తున్నారు’ అని ఫైర్ అయ్యారు. జగన్ పక్కకు పోతే జరిగే నష్టంపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ‘పిల్లల చదువులు ఉండవు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉండదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోతుంది. రైతన్న చతికిలపడిపోతాడు. అక్కాచెల్లెళ్ల బతుకులు ఛిన్నాభిన్నమవుతాయి. పేదల కోసం పోరాడేది జగన్ ఒక్కడే’ అని , పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని సీఎం జగన్ దుయ్యబట్టారు.

Read Also : Gruha Jyothi: రాష్ట్రంలో వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు.. జీరో బిల్లులు జారీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది